అక్షర కొరకుఅంశం :⁠- చిత్ర కవితతేది:⁠- 12/11/2025శీర్షిక:⁠- మౌనం కొన్నిసార్లు

                                         అనిత కళ్లల్లో ఆవేదన, చేతి వేళ్ళను కొరుకుతూ దిగులుతో కూర్చుంది. పక్కనే కూర్చున్న విక్రమ్ మొహం తిప్పుకున్నాడు. గత కొన్ని నెలలుగా వారి మధ్య ఇదే పరిస్థితి. ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ ఉన్నా, మధ్యలో అపార్థం అనే గోడ పెరిగిపోయింది.

ఆ రోజు రాత్రి అనిత ఫోన్‌లో ఏవో సందేశాలు చూసి విక్రమ్ గట్టిగా అరిచాడు.
“నాకు చెప్పకుండా నీ రహస్యం ఏంటి? నువ్వు నా నుంచి ఏం దాస్తున్నావు?” అని అనిత.
విక్రమ్ మొహంలోకి కూడా చూడలేక, బాధతో చేతితో తల పట్టుకుంది. అతని ఆరోపణలు విస్మృత దారులలోకి ఆమెను నెట్టేసాయి.
విక్రమ్ దృష్టిలో,
అనిత ఏదో ముఖ్యమైన విషయాన్ని దాస్తోంది. అతను అరిచిన తర్వాత కూడా, ఆమె మౌనం వహించింది. తన చిలికిన హృదయం మాట చెప్పలేని ఆవేదనలో ఉంది.
అసలు విషయం ఏమిటంటే…
అనిత తల్లికి గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆమె విక్రమ్‌కు భారం కాకూడదని, తన పాత స్నేహితురాలితో కలిసి విస్మృత దారులలో మరుగున పడిన తన నగల వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించింది. అది రహస్యంగా చేసిన ప్రయత్నమే విక్రమ్‌కు అనుమానంగా మారింది.
ఆ మరుసటి రోజు అనిత ఇంట్లో ఒక పసుపు రంగు దుపట్టా ధరించి నిలబడింది. ఆ ముసుగులో ఉన్న పవిత్ర ఆమె లక్ష్యం గురించి చెబుతోంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఆమె స్నేహితురాలు, విక్రమ్‌తో అన్ని విషయాలు చెప్పింది.
నిజం తెలిసిన విక్రమ్ పశ్చాత్తాపంతో కుంగిపోయాడు.
మౌనం కొన్నిసార్లు అపార్థాలకు దారి తీస్తుందని గ్రహించాడు. ఆ తర్వాత అనిత తల్లి చేయిస్తాడు. విక్రమ్ , అనితకు క్షమాపణలు చెప్పగానే…
కన్నీళ్లతో క్షమించి విక్రమ్ ని కౌగిలించుకుంటుంది అనిత. దూరం నుండి వాళ్ళందరిని చూసిన పవిత్ర ఆనందపడుతుంది.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కథ నా సొంతం అని హామీ ఇస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *