శీర్షిక – అమ్మ
ఏ ఇంట్లోనైనా బాధ్యత
ఎక్కువ అమ్మదే!
తను తిన్నా తినకపోయినా
కష్టం చేస్తూ కుటుంబం లో
అందరి కడుపూ నింపుతుంది
ఇంటి యజమాని కేదైనా అయి
సంపాదించలేక పేయినా తనకు
తోచిన రీతిలో సంపాదిస్తూ
ఇళ్లు గడుపుతుంది
తన రెక్కలు ముక్కలయేలా
శ్రమించడమే తన పని!
అలాంటి అమ్మలు ఇలలో ఎంతో మంది
అమ్మ హృదయం ఆకలంటూ ఎవరు
వచ్చినా అన్నపూర్ణగా మారి ఉన్నంతలో
అందరికీ పెడుతుంది!
అమ్మ ఎవరికైనా అమ్మనే!
అన్నం పెట్టడంలో అన్నపూర్ణ
ఆదరించడంలో అమృత వీణ
ఏదీ ఆశించక పోవడం ఆమె గొప్పతనం
ప్రేమ పంచడంలో అమృత కలషం!
అమ్మ ఉన్నంత వరకూ మనకు ఆకలే
తెలియదు!
అలాంటి దయామయులైన అమ్మలందరికీ
వందనాలు!
ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా