సాంప్రదాయానికి మారుపేరు

అక్షరలిపిరచయితలుఅంశం- చిత్రకవితశీర్షిక- సాంప్రదాయానికి మారుపేరు

డా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం🌝🌒🌖🌝🌒🌗🌖🌝🌒🌝

పింక్‌ పట్టు చీరలో మెరిసేఆమె నవ్వు—ఒక దీప్తిమంతమైన వెలుగు;

పూలతోరణం లాఆమె చేతుల్లో పంచదార గంధం.

ఓ ఆలయ ద్వారం తలుపులు
నెమ్మదిగా తెరుచుకున్నట్టూ—
ఆమె చూపుల్లో
భక్తి జలపాతం జారుతుంది….

ఆమె అంచుల్లో మెరవొచ్చిన
బంగారు తీగల్లా ఆశలు;
హారంగా కట్టుకున్న
సంకల్పాల గీతాలు…

చేతులలోని దీపానికి
ఆమె హృదయం శాంతిని పోసేస్తోంది;…
సిరిసంపద గాలిలో
ఆమె నవ్వు జ్యోతి నాట్యం చేస్తోంది…..

వేళ్ల వెంట జారిన
ఆ ముద్దుముద్దు పూల పరిమళం..
ఒక ఇంటి సంతోషాల
మొగల్తినే తాకినట్లుంది…

ఆమె నిలువు బొమ్మలో—
ఒక పండుగలానే పవిత్రత;….
ఒక అమ్మమ్మ కథలానే
ఆప్యాయత;…
ఒక దీపారాధనలాగే
నిత్యమైన శాంతి….
🌒🌖🌗🌖🌒🌖🌗🌖🌗🌒
ఇదినాస్వీయరచన
డా.భరద్వాజ రావినూతల
కొత్తపట్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *