కథనంఅంశం : బస్సు ప్రమాదంలో నేనుంటే,,,,,శీర్షిక : పునర్జన్మ అంటే ఇది,,,,,,!!

మాహాసముద్రంలో నావలోలా జనం నిండిన బస్సు
పరిమితి మించిన వేగంతో పయనిస్తూ
బస్సులో జనం నిద్రలో జోగుతూ,,,,,,
హఠాత్తుగా గుండెలు పగిలేలా ఢీకొంటూ,,,,,,,,
బస్సు అద్దాలు పగిలి తలలు కిటికీల్లో ఇరుక్కుపోయి,,,,,,,
భూకంపం సంభవించినట్లు హాహాకారాలలో రక్తపుటేరులు పారుతూ,,,,,,,,
నా గుండెల్లో గాజు పెంకు గుచ్చుకుని గొంతు పెగలని స్థితి,,,,,,,,,
అయినా నా భార్యను జయ్ లేరా అంటూ ఎగశ్వాస దిగశ్వాసలలో ఊపిరి బాసలు చేస్తూ,,,,,,,,,
నా బిడ్డడు కృష్ణకు మొహం చీరేస్తూ గుచ్చుకున్న గాజు పెంకుల్ని పీకేసుకో అంటూ కోన ఊపిరిలో నేను కొట్టుమిట్టాడుతూ,,,,,,,,
లేవండి మనం ముగ్గురం జీవించాలి ఆయాసంతో అంటూ సోలిపోతుంటే,,,,,,,,,
డాడీ ,,,,,డాడీ,,,, అంటూ నా బిడ్డ గాజుపెంకుల్లోంచి తొంగిచూస్తూ పీకేసుకుంటూ,,,,,,,,,
నా గుండెల్లోంచి రక్తం చిమ్ముతూ చుట్టూ పారుతూ హరిగోస తీస్తూ,,,,,,,
మమ్మీ జాగ్రత్త రా కృష్ణ పెగిలీపెగలని గొంతు స్పృహ కోల్పోయే దీనస్థితి,,,,,,,,
నా భార్య జయ అపస్మారక స్థితిలోకి జారుకునే పరిస్థితి,,,,,,,,
నేను చూస్తుండగానే బస్సులో నిండు ప్రాణాలతో చెలగాటం చావుబ్రతుకుల మధ్య,,,,,,,,
నా బిడ్డ ముఖం రక్తసిక్తమైనా తల కిటికీలోంచి బర్రున లాక్కొంటూ ఆ రక్తపుటేరుల్లో తనకు తాను తమాయించుకుని,,,,,,,,
నా బిడ్డ గుండెల్లో గుచ్చుకున్న గాజువక్కలను పీకేసి డాడీ లే అంటూ అయ్యో దేవుడా ఏమిటి శిక్ష అంటూ విలపిస్తోంది,,,,,,,,,,
నా భార్యను మమ్మీ మమ్మీ అంటూ గుండెలపై అరచేతితో రుద్దుతూ రక్తం పోటెత్తిన శరీరాన్నంతా తుడుస్తూ లేలే అంటోంది,,,,,,,
అంతలోనే అంబులెన్స్ వాళ్ళు వచ్చారు అంతవరకే నాకు గుర్తు,,,,,,,,,
నేను నా భార్య నా బిడ్డ ముగ్గురం హాస్పిటల్ బెడ్లపై పడివున్నాం,,,,,,,,,
మమ్మల్ని నిరంతరం పర్యవేక్షణ చేస్తూ డాక్టర్లు ,సిష్టర్లు మమ్మల్ని మృత్యుకుహరం నుండి కాపాడారు,,,,,,,,,
నేను అన్న కొన్ని ఊపిరి మాటలతో నా బిడ్డ నాకు, నా భార్యకు పునర్జన్మ నిచ్చింది,,,,,,,,,,

అపరాజిత్ రెడ్డి
సూర్యాపేట
హామీ పత్రం :ఈ రచన నా కలం సేత యని నా హామీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *