పెద్ద ప్రేరణాత్మక కథ
ఒక సినిమా మార్చిన నా జీవితం —
జీవితంలో ఒక దశ ఉంటుంది—ఎక్కడికి వెళ్లాలో తెలియని గందరగోళపు దారి.
నాదీ అంతే. డిగ్రీ పూర్తయింది, కానీ దిశ మాత్రం కనిపించలేదు. ఇంట్లో అందరూ “ఏం చేయాలనుకుంటున్నావు?” అని అడిగే ప్రతిసారీ నా గుండెలో కంగారు పెరిగేది. నాకేమీ తెలియకపోవడం కాదు, నాకు నన్ను నమ్మే ధైర్యం లేకపోవడమే పెద్ద సమస్య.
ఆ రోజు డిశంబర్ 9- 2016 సాయంత్రం 7 గంటలప్పుడు స్నేహితుడు ఫోన్ చేశాడు:
“రా… ధ్రువ సినిమా మొదలవుతుంది. వెళ్దాం ”అని
ఆసక్తి లేకపోయినా వెళ్లాను.
కానీ నాకు తెలియదు
ఆ రెండు గంటల నలబైఐదు నిముషాల సినిమా నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుందని.
సినిమా మొదలయ్యింది.
రామ్ చరణ్ స్క్రీన్ పై కనిపించగానే ఒక మాట నా మనసులోకి దూసుకొచ్చింది
“ఇది కేవలం హీరో కాదు… ఇది ఒక లక్ష్యానికి ప్రతీక.”
ధ్రువ IPS పాత్రలో అతను చూపించిన నిశ్చయబుద్ధే నాకు కళ్లెదుట నిలిచిపోయింది.
ఒక చిన్న తప్పు పైన కూడా అతని చూపు తప్పదు.
చిన్న క్లూ అయినా అది దేశ సమస్యకు దారి తీస్తుందని అతను చెప్పే తీరు…
అవినీతిని బలంగా ఎదిరించే గట్టిపట్టు…
అన్యాయం చూస్తే ఒక్క క్షణం కూడా ఆగని ధైర్యం…
ఈ సన్నివేశాలు నాలో ఎక్కడో నిద్రపోయిన ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలిపాయి.
ముఖ్యంగా ఒక డైలాగ్
“దేశానికి ఉపయోగపడాలని కల కనడానికి నువ్వెందుకు భయపడుతున్నావు?”
అది నా హృదయంలో ముద్ర పడింది.
సినిమా ముగిసింది…
కానీ నా ఆలోచనలు మాత్రం ఆగలేదు.
ఇంటికి వచ్చిన తర్వాత అద్దం ముందు కూర్చొని మాట్లాడుకున్నాను
“నేనూ కూడా ఏదో చేయగలను కాదా?
నాలో ధైర్యం చాలా ఉంది మరేం లోపం లేదు కదా?”
అని నన్నే నేను అడిగాను.
ఆ రాత్రి నిద్ర పట్టలేదు.
గుండె లోపల ఏదో చెబుతోంది
“నీ జీవితానికి అర్థం దొరికింది… ఇప్పుడు ప్రయాణం మొదలు పెట్టె సమయం.”
తరువాతి రోజు ఉదయం 8 గంటలకే బయటకు వెళ్లి UPSC కోసం కావాల్సిన పుస్తకాలు అన్ని కొనుక్కొచ్చాను.
ఇంటికి వచ్చి, టేబుల్ పై పెట్టి పెద్ద అక్షరాలతో రాసాను
“UPSC My Dream. Dedication. Discipline.”
చదువు మొదట్లో చాలా కఠినంగా అనిపించింది.
గంటలు గంటలు చదివినా అర్థం కాని విషయాలు వచ్చేవి.
పాత అలవాట్లు అడ్డం వచ్చేవి.
కానీ ప్రతిసారి నాకు
నా కళ్లముందు ధ్రువ క్యారెక్టర్ కనిపించేది
శాంతంగా, నిశ్చలంగా, ఒక్క మాట గుర్తుకు వచ్చేది
“నువ్వు మొదలెట్టినది చిన్నదేం కాదు… వెనక్కి తిరిగి వెళ్లే అవకాశం లేదు.” అని
అది చాలు. మళ్ళీ నేను తిరిగి పుస్తకాల దగ్గరకు వచ్చేవాడిని.
ఒక్కో పేజీ చదివినకొద్దీ నా లోపల ఉత్సాహం పెరిగింది.
సమాజం కోసం, దేశం కోసం ఏదో చేయాలి అనే భావనా నాలో బలపడింది.
ఇప్పుడు ఎవరైనా “UPSC కష్టం” అంటారు.
కానీ నేను నవ్వుతాను.
ఎందుకంటే నాకు తెలుసు
కష్టం అనే THING కి అసలైన అర్థం ధ్రువ సినిమా నేర్పింది.
పోటీ అంటే భయం కాదు,
సేవ చేయాలన్న తపనకు చేసే పరీక్ష మాత్రమే.
నేడు నా చదువులో ఎంతో దూరం వచ్చాను
కానీ ఒక విషయం మాత్రం నిజం
ఎవరైనా నా ప్రేరణ ఏమిటి అని అడిగితే
గుండెల మీద చెయ్యి పెట్టుకుని చెబుతాను
“ధ్రువ సినిమా నా జీవితాన్ని నాకు మార్గం చూపించిన కాంతి “
ShivRmShnkr… ✍️