గీతా జయంతి

మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి నవంబర్ 30 రాత్రి 9:29కు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రకారం డిసెంబర్ 1న గీతా జయంతిని జరుపుకోవాలి. గీతా జయంతి రాముడు సీతా వివాహ ధర్మం, గౌరవం, శాశ్వత ప్రేమకు ప్రత్యేకంగా జరుపుకుంటారు. శ్రీమద్ భగవద్గీత జననానికి గీతా జయంతి ప్రతీక. కృష్ణుడిని పూజిస్తారు.

గీతా జయంతి చాలా పవిత్రమైన రోజు. ఆ రోజున శ్రీకృష్ణుని ప్రత్యేకించి ఆరాధిస్తారు. భగవద్గీత పారాయణం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం. అలాగే గీతా జయంతి నాడు చేసే దానధర్మాలకు కూడా విశేష ఫలితాలు లభిస్తాయి. ఓం కృష్ణాయ నమః, ఓం శ్రీ కృష్ణ శరణం మమ అనే మంత్రాలను జపిస్తే మంచిది.

ఈసారి గీతా జయంతి నాడు శివవాస యోగంతో పాటు అభిజిత్ ముహూర్తం కూడా ఉంది. ఈ యోగాల సమయంలో కృష్ణుడిని ఆరాధిస్తే, కృష్ణుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. కోరికలు కూడా నెరవేరుతాయి.

గీతా జయంతి నాడు ఈ ప్రత్యేక పరిహారాలను పాటించండి:

  1. కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం ముందు దీపారాధన చేసి ధూప, దీప, నైవేద్యాలను సమర్పించండి.
  2. గీతా జయంతి ఉపవాసం ఉంటే కూడా మంచిది. కృష్ణుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
  3. సాత్విక ఆహారాన్ని తీసుకోండి. సాత్విక ఆహారం తినడం వలన మనసు, శరీరం రెండు ఆరోగ్యంగా ఉంటాయి.
  4. పేదలకు వస్త్రాలు, డబ్బు , ఆహారం వంటివి దానం చేస్తే పుణ్యఫలితం లభిస్తుంది.
  5. తులసి పూజ చేస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు.
  6. శివ–పార్వతులను గీతా జయంతి నాడు ఆరాధించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి.
  7. ఈ రోజు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపిస్తే కృష్ణుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజును గీతా జయంతి జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం.. మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజు ఈ గీతా జయంతిని జరుపుకొంటారు. భగవద్గీత అనేది అర్జునుడు కర్తవ్య నిర్వహణలో తికమక పడుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనంగా అనుగ్రహించిన మహోపదేశం. ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకి, సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలోనూ భగవద్గీత ప్రమాణంగా నిలుస్తోంది.

గీతా జయంతి రోజున కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని కౌరవ రాజు అయిన ధృతరాష్ట్రుడికి సంజయుడు వినిపించాడట. ఈ గ్రంథం మనకు లభించిన వరంగా భావించాలి. సుమారు 6,000 సంవత్సరాల పూర్వం ఉపదేశించబడినా నేటి ఆధునిక కాలపు మనుషులకు కూడా ఉపయోగపడుతుందంటే దీని విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ పవిత్ర గ్రంథం నేటికీ ఎంతో మందిని మంచి మార్గంలో నడిపిస్తుంది.

సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కాబట్టి ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో భగవద్గీత ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతలో వేద, వేదాంత, యోగ విశేషాలు ఉన్నాయి. భగవద్గీతను వాడుకలో గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీన్ని గీతోపనిషత్తు అని కూడా అంటారు. సనాతన ధర్మం, పురాతన గ్రంథాల ప్రకారం ద్వాపర యుగంలో మార్గశిర మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజు కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత బోధనలు బోధించాడట. కాబట్టి ప్రతి సంవత్సరం గీతా జయంతిని మార్గశీర్షం శుక్ల పక్ష ఏకాదశి రోజు జరుపుకుంటారు.

పాండవులు, కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో యోధులు ప్రాణాలు కోల్పోయారు. అర్జునుడు సైతం మానసికంగా కుంగిపోయిన సమయంలో శ్రీకృష్ణుడు జీవిత రహస్యాన్ని, మన జన్మ కర్మ సిద్దాంతాన్ని బోధించడం ద్వారా అర్జునుడిలో మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. కఠిన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో, ప్రతికూల సమయాల్లో కూడా విజయం సాధించడం ఎలాగో వివరించాడు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉంటాయి. ఇవి మనిషి జీవితానికి సరిపడా జ్ఞానాన్ని అందిస్తాయి. జీవితంలో సానుకూలతను కలుగజేస్తాయి.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *