అక్షర సమూహం
అంశం : చిత్రకవిత
శీర్షిక :మనస్సు కోల్పోయిన స్వప్నాలు
రచయిత : అపరాజిత్ రెడ్డి
నాకై నేను గోరీ కట్టుకుని మనిషి నయ్యాను
ఈ వృద్దాప్యంలో పుంసత్వం లేని పురుషోత్తముణ్ణి
గాడితప్పిన జీవితం చరమాంకం ఓ పగిలిన అద్దం
తలారి ఉరికంభం తాడుకు వేలాడుతున్న శరీరాన్ని
దిగంతాల కావల దాకా వినిపించేలా రోదించినా పట్టించుకోని లోకం
చెద చీమలు తింటున్న మనస్సు అగ్నికూపం
ఆలోచనల అలజడితో అలసి విసిగి విరిగిపోతున్న మనస్సు
మనస్సు నిండా మండుటెండల ఎడారి మబ్బులు
వయస్సు ముదిరిన రోగి కళ్ళు గతం తాలూకు విషాద స్వప్నాలు
ఎటు చూసినా కారుచీకట్లు కమ్ముకొస్తున్న మనస్సు గుహ
నిప్పులు కక్కే ఎండల్లో ఎండమావులలో నీటి కోసం పరుగులు
రక్తం చచ్చి పాలిపోయిన శరీరాన్ని మోస్తూ ఇంకెన్నాళ్ళు
ఆలోచనల తీవ్రతతో పగిలిపోతూ వడలిపోతున్న మనస్సు
ఈ అక్షరాలు ఇలా లిఖిస్తూపోతే శృతితప్పిన రాగాలన్నీ బయటికి వస్తాయి,,
ఎంత మనోహరమైన గీతాలు లిఖిద్దామన్నా విషాద జీవితమే కలం రాస్తోంది
హృదయం ముక్కలైన బోటి పడవ కదలదు కదా
రాగాలు పోయే గొంతు రోగగ్రస్తమై మూగబోతోంది
మాయామర్మం తెలియక బ్రతికిన బ్రతుకు అమాయకత్వపు అలసట
ఒకరికొకరు కుంపట్లు రగుల్చుకోవడం తెలియదాయె
ఉరుములు మెరుపులతో ముంచుకొస్తున్న మృత్యు ఘంటికలు
నా విజయాలన్నీ ఓటమి ద్వారాల గుండా పరుగుల పగుళ్లు
చెట్టుకు కాసిన కాయలన్నీ రాలిపడుతూ కొమ్మలనన్నీ కూల్చేస్తున్నాయి
రక్షణ లేని సమాజం కల్లోలాల కార్చిచ్చుల ఆరనిమంటలు
నన్ను నేను మార్చుకోలేక జీవిత మంతా కష్టాల కావడి మోతలు
నా చుట్టూ ఎటు చూసినా సమాధులే అవును స్మశాన వైరాగ్యం
అపరాజిత్
సూర్యాపేట
హామీ పత్రం : ఈ కవిత నా కలం సేత యని నా హామీ