ఆనందం విషాదాల నెలవు మనస్సు

అక్షర సమూహం
అంశం : చిత్రకవిత
శీర్షిక :ఆనందం విషాదాల నెలవు మనస్సు,,,,,,!!
రచయిత : అపరాజిత్ రెడ్డి

మనస్సు మాయలమరాఠి
శరీరాన్ని ప్రపంచాన్ని నడిపే ఆలోచనల పరాశక్తి మనస్సు,,,,,,
చింతనా జ్వాలలు మిన్నంటి మనిషి మూలాల దాకా తినేసే రాక్షసి మనస్సు,,,,,,,,,,,,
చదువులలో ఆలోచనల అలజడులు ఉజ్వల భవిష్యత్తుకై తీగతెగిన వీణలా తపియింపజేయు మనస్సు అనే గుహ,,,,,,,,,,,,,
మనస్సుపడే వేదన సంవేదనలన్నీ తన ఉనికికి జిహ్వకు మూలమైన దాన్ని పోగొట్టుకుని తహతహలాడినపుడు,,,,,,,,,,,
మనస్సు గూడులో శతకోటి ఆలోచనలు రివ్వున ఎగిరే పక్షుల్లా కోలాహలం ఒకదానికొకటి పడీపడక సంఘర్షణలు,,,,,,,,,,
మనస్సును అదుపులో పెట్టకపోతే కళ్ళాలు లేని గుర్రాల్లా విచ్చలవిడిగా ఆలోచనలు పరుగులు పెడతాయి శరవేగంగా,,,,,,,,,,,,,,,
మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ఉండాలనే తలపులలోనే అలజడులు తీవ్రమైన ఒత్తిడికి గురై గుర్తెరుగని ప్రస్తుత కర్తవ్యం,,,,,,,,,,,
మనస్సు ఘర్షణలో మనస్సు పొరల్లో రసాయనిక మేళవింపులు మార్పులు అనిశ్చిత పరిస్థితులకు దోహదం చేస్తాయి,,,,,,,,,,,
మనస్సు ఒకోసారి విషాద రాగాలు ఆలపించే సప్తస్వరాల్లా మెదడునంతా తినేసే తేజాబులా నలగ్గొట్టి శరీరాన్నంతా హింసించి రోగిని చేస్తుంది,,,,,,,,,,,,
జీవితాన్ని విజయపథంలో నడిపించేది మనః చంచలత్వంతో అహంకారంతో పొగరుబోతు పోట్లగిత్త చేసేది మనస్సే,,,,,,,,,,
జీవితంలోని వివిధ సంఘటనల జ్ఞాపకాల దొంతరను విప్పి మరీ ఆనందించడమో విచారించడమో చేస్తూ కర్తవ్యాన్ని మరచి కంగాళీగా జీవితం అధోగతిపాలు చేసుకోవడం తగదు,,,,,,,,,,,,,
నీవు నీమనస్సు వేరుకాదు నిరంతరం అదుపాజ్ఞలలో ఉంచుకుంటూ సమతూకంగా జీవితాన్ని కొనసాగించకపోతే అధోగతే ఇది మరువకు,,,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట
హామీ పత్రం : ఈ రచన నా కలం సేతయని నా హామీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *