ఓయ్ నీవు నీవే

అక్షర సమూహం
అంశం : చిత్రకవిత
శీర్షిక : ఓయ్ నీవు నీవే,,,,,,!!
రచయిత : అపరాజిత్ రెడ్డి

ఈ నిశి రేయి నీవు నిప్పు కణికవై ఎగిసిపడాలి,,,,,,,,
ఈ వెన్నెల నీటిలో నీ కన్నీళ్ళు కరిగిపోనీ చివరికంటా,,,,,,,,
ఈ తొలిపొద్దు నీరెండలో నీలోని విషాదం కలగలిసి సమసిపోనీ,,,,,,,,,,
ఈ చెట్ల నీడలో నీ ఆకలి మంటలకు అర్థం తెలుసుకో ఈ కాసే ఎండలేనని,,,,,,,
ఈ నిప్పుల సెగలు నీ దాహార్తికి మూలమని తెలుసుకో తెలివిగా,,,,,,,,
ఈ జానెడు పొట్ట కోసం నీకు సకల కళలు ఈ లోకంలో,,,,,,,,
ఈ జన్మకు సరిపడా నీకున్నదన్న జ్ఞానం బ్రమలో నిన్ను నిన్నుగా చూసుకోలేని అజ్ఞానం,,, ,,,,,,,
ఈ జీవితంలో నీవు ఒంటరినన్న నిస్తేజం నీవులేని లోకం బహుసుందరం చూసుకో నీలోకి,,,,,,,,,,
ఈ ప్రపంచం నీ జ్ఞానాన్ని చూడదు నిన్ను నీ వ్యక్తిత్వసంపద చూస్తుంది,,,,,,,,,,
నీ జ్ఞానం పేకమేడల డబ్బు ఆకలి తీర్చదు అశాంతికి మూలం,,,,,,,
నీవు బ్రతికుండగానే నీ సమాధి నీవే కట్టుకుంటావు సిరిసంపదలు, సుఖభోగాల్లో,,,,,,,,,,
నీ కీర్తిప్రతీష్టలు నీవులేని లోకంలో నీవు నించొని చూస్తున్న సూర్యాస్తమయం లాంటిది,,,,,,,,,
నీవు నిద్రపోయి తెల్లవారినాక ఈ లోకం ఎంతమారిందో చూడు ఒక్కక్షణం ,,,,,,,,,,,
ఈ లోకం మార్పులో నీవు ఒకభాగమే,,,,, నిన్ను నీలో చూసుకో,,,, లోకం మారుతుంది,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం : ఈ రచన నా కలం సేతయని నా హామీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *