ఏడు అద్భుతాలున్నాయి

ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉన్నట్టే…మన జీవితంలో, మన చుట్టూ కూడా ఏడు అద్భుతాలున్నాయి.❤️❤️❤️

మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన వ్యక్తి… మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన… తల్లి మొదటి అద్భుతం.

మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని, తన కన్నీళ్లను దాచేస్తూ… మన పెదవులపై చిరునవ్వును చూడాలని కష్టాలను సహితం లెక్కచేయకుండా….దుఃఖాన్ని తాను అనుభవిస్తూ.. సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం…..

మన తప్పులను వెనుకేసుకు రావాడానికి…
మన కోసం పోట్లాడడానికి…మనకు ‘మేము ఉన్నాం’ అనే ధైర్యం,భరోసా ఇవ్వడానికి ఉన్న బంధమే
తోడబుట్టినవాళ్లు. వీళ్ళు మూడో అద్భుతం……

మన భావాలను పంచుకోడానికి..
మనకు మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి…
ఏది ఆశించకుండా…అన్నింటా మనకు అండగా ఉండే మనకు దొరికిన మంచి స్నేహితులు నాలుగో అద్భుతం….

భార్యభర్తల బంధం…ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను ఎదిరించేలా చేస్తుంది. కలకాలం తోడూ నీడగా ఉంటూ…ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే…ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది. .భార్య..భర్త అర్థం చేసుకునేవారు దొరికితే జీవితంలో ఐదో అద్భుతం మన సొంతం .

ఇక పిల్లలు…మనలో స్వార్థం మొదలవడానికి కారకులు. మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది. వారి ఆలోచనలే ఎప్పుడూ మన చుట్టూ ఉంటాయి. వారి కోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది.
వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని…తల్లి తండ్రులు అసలు ఉండరు… అందుకే పిల్లలు ఆరో అద్భుతం.

అన్ని అయిపోయాయి ఇక ఏడో అద్భుతం ఏంటా అని అనుకుంటే…వాళ్ళే మన పిల్లల పిల్లలు..మనవళ్ళు..మనవరాళ్లు…

వీరికోసం ఇంకా కొన్నిరోజులు బతకాలనే ఆశ మనలో మొదలవుతుంది. వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, మళ్ళీ పసిపిల్లలమైపోతాం కూడా.
వీరు మన జీవితానికి దొరికిన.. ఏడో అద్భుతం….

ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూనే ఉండగా,
ఎక్కడెక్కడో వాటికోసం వెళ్లి వెతుకుతుంటాం.
కాసింత ప్రేమ ఉంటే చాలు…ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి…
చిన్న పలకరింపు చాలు…మనల్ని మనం అద్భుతంగా చూడడానికి…
ఇలా అందరిని చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం …

ఇప్పుడు మన మధ్య ఉన్న మనిషి మళ్ళీ రేపు తెల్లవారేసరికి వుంటాడో లేదో తెలియని కాలం ఇది. అందుకే ఉన్న దానితో సర్దుకుపోయి హాయిగా,ఆరోగ్యంగా జీవించడంలోనే ఉంది ఆనందం. ఇది మన జీవితంలోనే మహా గొప్ప అద్భుతం..
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *