దిక్కులు దాటించాలి…!!!
నిన్న నేర్పినది నేడు రూపమై
నేడు నేర్చుకొన్నది నేటికి వ్యూహమై…
అడుగేస్తూ అందరిలో సమయమవుతు…
కదం తొక్కుతు కరుకును అరగదీయాలి….
పొదగిన పదాల వెల్లువతో ప్రాకారమై
ప్రతి మదిని తట్టి తలుపులు తెరవాలి…
నిజాల నిరూపణతో రోజులను నడుపాలి…
అవినీతికి అంతం ఎక్కడో
ప్రగతికి స్థానం ఏదో తెలుసుకోవాలి…
తమకోసం తమచేత ఎన్నుకోబడిన
వ్యవస్థలో మనిషిని మనిషే దోచేస్తుంటే…
మానవహారమై మనస్సుతో తేజమై…
అడ్డగోలతో ఆటాలాడే ముసుగుచాటును
వ్యతిరేక ఉద్యమంతో పచ్చబొడువాలి…
స్వార్థం వీడి సమతా మమతలతో కూడి…
రెక్కలిప్పిన అవినీతిని భూతాన్ని
పొలిమెర దేవతవై దిక్కులు దాటించాలి…
పరిస్థితుల ముందర మోకరిల్లక
మూసిన గదులలో చీకటిని తపించక…
కదిలే సమయాన్ని వేదనలతో గుచ్చుక…
అవినీతి పేరుకుపోయిన సమాజాన్ని
పొట్టు తేల్చుతు పొత్తాన్ని తూర్పారబోస్తూ
స్త్రీ సాధికారితను పాడే స్వతంత్ర్య గీతమై
పెరిగే అవినీతికి చరమగీతం పాడాలి…
ప్రకృతి పరుచుకొన్న విశాలంలో
ప్రతిది స్వార్థాన్ని వీడిన ఆస్వాధింపే…
అనురాగాన్ని పంచుకొనే ఆప్యాయతలే…
మరెందుకు నీకు అవినీతి కార్యకలాపాలు
నలుగురి ప్రమేయంతో సంఘమవుతు…
ఆడుతు పాడుతు హృదయాన్ని పంచుతు
అవినీతిరహిత సమాజాన్ని నిర్మించాలి…
దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396