సోయగం

కీకారణ్యంలోకి ప్రవేశిస్తే ఆ అరణ్యం హోరులో కోయిలలు, వింత వింత పక్షులు పాడే పాటలు హృదయం తేలిపోతూ, మనస్సు తనువు తమకు తెలియకుండానే ఊగిపోతూ శివతాండవం చేసినట్లు ఈ లోకాన్ని వీడి ఏదో అద్భుత పరలోకంలోకి ప్రవేశించిన అనుభూతి.ఇహలోకంపైనే స్వర్గతుల్య ఆహ్లాదకరమైన అనుభూతి జీవితంలో మరచిపోలేనిది, హృదయంలో మనస్సు లయమైనట్లు వింతైన సమ్మోహితులను చేసే జీవన సోయగం మరువలేనిది.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *