నా సాహిత్యం దేనికోసమంటే,,,,,,!!
నా సాహిత్య జీవితంలో చివరి మాజిలీలో చివరి అక్షరం వరకు ప్రకృతి సిద్ధమైన జీవన విలువలనే లిఖిస్తాను.అక్షరాలను అంగడి బొమ్మలను చేసి అమ్ముడుపోయే రచనలు చేయను.ప్రభాతంలో విరిసిన గడ్డిపూవుల నుండి మనుష్యుల జీవితాల్లోని జీవన లయలలో ఆశలు చిగురించే బ్రతుకు పూలవనాలను అక్షరాలలో సృజియించి మేల్కొలుపుతాను.లతలు లతలుగా పెనవేసుకునిపోయే జీవితానుబంధాల కోసం సహజ విలువల జీవితావసరతలను ప్రభోధిస్తాను. ప్రకృతి అందాల సుగంధాల సృష్టిలోని ఆనందాలను ఆహ్లాదాలను అక్షరాలలో నిక్షిప్తం చేస్తాను.ఆకలి కేకల నిరుపేదల దుఃఖాలలో ఊపిరిలూదుతూ వాళ్ళ అక్షర కుటుంబీకున్నవుతాను.
అపరాజిత్
సూర్యాపేట