అమావాస్య చంద్రులు (జీవిత సత్యం)

అమావాస్య చంద్రులు (జీవిత సత్యం)

ఈ రోజు నా మనస్సులో ఏదో తెలియని దిగులు గూడుకట్టుకుంది. జీవితంలో నెలవంకలు, పౌర్ణిమలు ఆనందాలన్నీ వెలిసిపోతూ వెలిపోతున్నాయి.మొదటినుండి తల్లి అతిప్రేమ చాలా వయసొచ్చే వరకు వ్యక్తిత్వం రూపుదిద్దుకోలేదు.పెళ్ళి అయిన దగ్గర్నుండి ఒకటొకటిగా కన్నీటి సెలయెరులతో, తలపై నుండి సముద్రాలు వెళ్లిపోయాయి. జీవనయానంలో కుళ్ళాయి తాగి ఆకలి తీర్చుకున్న దగ్గర్నుంచి ,జీవనోపాధికి ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ,అంచెలంచెలుగా చదువుల విలువ తెలిసొచ్చింది. నేను మా బడిపిల్లల దగ్గర్నుంచే అణగారిన వర్గాల ఆకలి బాదలతో పాటు, వాళ్ళ తల్లిదండ్రులు తాగే నాటుసారాయి ప్రాణాలతో చెలగాటం, వచ్చే రోగాలు సరేసరి. అవి పిల్లలను చదువులకు దూరంచేసి కట్టుబానిసలను చేసిన తీరు హృదయాలను కలచివేసిన దృశ్యాలు ,ఇప్పటికీ కళ్ళెదుట దర్శనమిస్తున్న జీవితం చవిచూసిన ,పగిలిన గుండెల చప్పుడు ఇప్పటికీ చెవుల్లో గింగురు మంటుంటాయి. ఈ మట్టిలో మాణిక్యాలను ఆదుకోలేని దీనస్థితి ఉపాధ్యాయునిగా. ఈ అమావాస్య చంద్రులు నన్ను కలిసినప్పుడళ్ళా ఏదో తెలియని నిస్సహాయత నన్ను వెక్కిరిస్తుంది.

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *