తొలిపొద్దు పొగమంచు సౌందర్యం

తొలిపొద్దు పొగమంచు సౌందర్యం

ఈ తొలిపొద్దు పొడిచే వేళ ఈ శీతాకాలం పొగమంచు కురిసే అందాలలో గజగజ వణుకుతూ లోకం పెనునిద్దుర వీడే వేళ, రంగురంగుల గుభాళించే పూవుల్లో మంచు ముత్యాళ్ళా ,సన్నసన్నటి మంచు బిందువులతో ద్విగుణీకృతమైన ఆకర్షణీయతలో, మనస్సులను కొల్లగొట్టే ముగ్దమనోహరమైన దృశ్యం, ఈ చలిలో నా హృదయాన్ని ఈ సౌందర్యం కొనగోట మీటి రాగాలు పలికించినట్లు ,ఏకాంతంగా నా మది నిండా గూడుకట్టున్న విషాదలోగిలిలోకి ప్రవేశించి గిలిగింతలు పెట్టే బ్రహ్మానందం,ఈ చలిలో ముద్దబంతులు, కనకాంబరాలు,చేమంతులు, సన్నజాజులు, గులాబీలు మంచుముత్యాలలో దివ్యతేజస్సు నింపుకున్న అవనీ పుత్రికలు, ఉషోదయంలో ప్రకృతి ఆరాధకులు ఆస్వాదించే ఇంద్రియజ్ఞాన తంత్రులు.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *