సుహృద్భావ ఆలోచనలు, శ్రమలే బ్రతుకు నిర్దేశాలు,,,,,,!!
వైరుధ్య భావాలు, అనుభవాల జీవిత పోరాటంలో
మనుష్యుల మన్నాక ఎన్నెన్నో మంచి మంచి ఆలోచనలు చేసినా, చెడు తలంపులు రాక మానవు
అయితే ఎటువంటి కార్య కారణాల్లో నైనా జయం మనదే అని ముందుకు సాగిపోవాలి తప్ప అధైర్యం కూడదు,,,,,,,,,,
దుర్బుద్ధితో ఎదుటి వారిని తోసేసి ముందుకెళ్తే వెంటనే కాకున్నా చివరకు కుప్పకూలేది మనమే,,,,,,,,
లౌక్యంగా వ్యవహరించి ప్రపంచాన్ని నెగ్గు అంటారు కాని కొంత దైవ అనుగ్రహం లేదా విధి నిర్ణయాన్ని బట్టి జీవితం సాగిపోయే నదీ ప్రవాహం,,,,,,,,,,,
పూసిన ప్రతి పూవు కాయలై పండ్లయి జీవితం పసందైన పండువెన్నెల కాదు,,,,,,,,,,,,
జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకుల్ని సౌమ్యంగా ఛేదించాలి మననుంచి కాలేనివి వాటిని వాటిగానే జరగనిస్తూ నిశితంగా గమణిస్తూ ఆకళింపు చేసుకోవాలి,,,,,,,,,,
జీవితంలో సుఖదుఃఖాలు మనం దైనందినంలో చేసుకొస్తున్న పనులు,ఆలోచనలను బట్టి పూవులు లేదా అగ్నిపూవులను చవిచూస్తాం,,,,,,,,,,,,
మట్టి పట్టుకుంటే బంగారం ఎప్పుడూ కాదు, ఆ మట్టిని సేద్యం చేసి పంటలు పండిస్తేనే ఫలితం తెలిసేది,,,,,,,,,
గాలి కబుర్లతో బ్రతుకు పెరుగన్నం కాదు ,అది డమడమ కొట్టుకునే డబ్బా లాంటిది,శారీరక మానసిక శ్రమలతోనే ఏదైనా సాధ్యమయ్యేది,,,,,,,,,,,,
రగిలే ఒకెరీతి అతివేడి మంటల్లోనే బంగారం నుండి సుందరమైన నగలు రూపుదిద్దుకున్నాయి, ఇంజనీర్లు, కార్మికుల కఠిన పరిశ్రమలతోనే ఈ పెద్దపెద్ద ప్రాజెక్టులు,పెద్దపెద్ద అంతస్థుల భవంతులు నిర్మించబడ్డాయి.,,,,,,,,,
నీ మానసిక, శారీరక శ్రమలలోనే జీవితానికి అర్థం పరమార్థం,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట