ఇది భయంకరమైన చలికాలం జర బద్రం,,,,,,!!
ఈ అలవిగాని చలి పంజావిప్పి ఎగబడుతూ పసిపిల్లల పాలిట శాపంగా మారింది.మా ఇంట్లో పిల్లలిద్దరికీ ముఖాలు మాడిపోయి, వళ్ళంతా వడలిపోయి,పెదవులు పగిలిపోయి చలి జ్వరాలతో గజగజ వణుకుతున్నారు.బుడ్డోడు ఏడుస్తూ కళ్ళ మంటలతో నా కళ్ళు చూడనియ్యడం లేదు డాడీ అంటూ మా వాడితో అంటుంటే నాకు గుండెల్లో గెలికినట్లయ్యింది.బుడ్డోడికి ఈ చలికి కళ్ళ కలక తో కళ్ళు నిప్పుల్లా ఎర్రగా అయ్యి గరగర మంటూ ఊసులు కారుతున్నాయి.బుడ్డది జ్వరంతో మూలుగుతూ జలుబుతో హాచ్,, హాచ్,,, అంటూ తుమ్ముతోంది. పిల్లల ముఖాలు దయ్యం పట్టినట్లు కమిలిపోయి గోసతీస్తున్నారు.దాంట్లోనే ప్రతిరోజు బడి సింహం గుహ ఆహ్వానిస్తున్నట్లు.మావాడికి కోడలికి మనస్సులో మనస్సులేక ఏడ్చేదొకటే తక్కువ, కకావికలమైపోయిన హృదయాలతో దావఖానకు పిల్లలిద్దరినీ హడావుడిగా తీసుకెళ్లారు. ఈ ఆరు ఏడు డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు ఉన్న చలికి ఈ బడులకు ప్రభుత్వం చలి తగ్గిందాక సెలవులు ఇస్తే ఏమయ్యిందో ఆ దేవుడి కెరుక. ఈ చలిగాలులకు పిల్లలే కాదు పెద్దల పరిస్థితి అదే.వైద్యులు డబ్బులు దండుకోవడానికి మంచి సమయం. ఈ అంటు వ్యాధులకు సరైన మందులు లేవు.ఉంటే గింటే కేవలం ఉపశమనానికే. ఏం చేస్తాం చలి గర్జిస్తోంది,,,,, గాండ్రిస్తోంది,,,,,,
అపరాజిత్
సూర్యాపేట