పుట్టినప్పటినుంచి వీడికి
కాలక్షేపం లేదు…….
ఇంటి పనుల్లో,కంప్యూటర్ దెయ్యాల చెప్పుచేతల్లో
అమ్మా,నాన్నా…….!
ఇరుగుపొరుగు సంబంధాలు అసలు లేవు……
కాలింగ్ బెల్లు అరుస్తేతప్ప
ఇంటి చెవులకు
వినిపించదు….!
ఇంటి తలుపులు తెరుచుకోవూ…..!!
శని వారం,ఆదివారం వస్తే….
వచ్చినా….
శాల్తీలు పదిగంటలవరకూ
ముసుగులు తన్నేసి ఉంటాయి…!
వీడికి నిద్రరాదు
మేలుకుంటే……
ప్రక్కన గురకలు వినిపిస్తుంటాయి…
చికాకు….
ఇల్లంతా తిరిగి
ఆకలికి బిస్కట్లో, పండ్లో
మేస్తుంటాడు……
సోఫాలో ఒరిగి
శూన్యంలోకి చూస్తుంటాడు…
కిటికీ అద్దాలో రెట్టలువీసే
పావురాల్లే
వీడికి దిక్కు…….
అందుకని
అప్పుడప్పుడూ
జుట్టు పీక్కుంటాడు….
కసిగా ఏడుస్తాడు…..
అమ్మానాన్నా కనిపిస్తే
బుంగ మూతిపెట్టి,రౌద్రంగా
కసిగా వాళ్ళ జుట్టు పీకేస్తుంటాడు……..
అందుకని వీడికి
అమ్మానాన్నా
మత్తు,గమ్మత్తు, చిత్తయ్యే
సెల్ ఫోన్……….
ముఖాన పారేస్తుంటారు…..,
వీడూ ఆ …..వ్యసనానికి బానిసౌతాడు…..
వీడు తెలుగోడే …..
తెలుగు మాత్రం రాదు….ఇంగ్లీషు,హిందీ,కన్నడాలు,
మిక్స్ చేసి తెలుగు దంచేస్తుంటాడు….
వచ్చిన కొరియర్ గాళ్ళు
భాష అర్ధంగాక
బిక్కముఖం వేస్తుంటారు…..!
వీడు సెల్ఫోను వదలడు
వదిలి……….
అక్షరాలు దిద్దుకుంటే
నాలుగు తెలుగు.పదాలైనా వచ్చేవి….!
జపమాల పట్టి ఉంటే
దేవుడైన ప్రత్యక్షమై
వీడికి వరాలిచ్చి
బాధలు తీర్చే వాడు……!
వీడు మూడు విధాలా చెడిపోయాడు……
ఆకాశానికి,భూమికి మధ్య
బతుకుతాడు…….
వీడి నలా మార్చిన
మమ్మీ,డాడీ ననాలి………
పిచ్…..పిచ్….పాపం……!!!
🥲🥲🥲
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
9490125878
🌷
15_12_25