రైతు పట్టిన నాగలి

అక్షర సమూహం
అంశం :నేటి పిల్లల ప్రవర్తన–సామాజిక బాధ్యత
శీర్షిక :రైతు పట్టిన నాగలి,,,,,,!
రచయిత అపరాజిత్ రెడ్డి

రైతు ఇంకిపోయిన చమట ఒడలు సాక్షిగా
రక్తపు ధారలు చిందే తన అరికాళ్ళు నాగేటి సాళ్ళై
నాగలి మేడి పట్టిన చేతులు కాయలు కాసిన పంటచేల పచ్చదనాల్లో
పారతో గట్లు వేసే గుండెచప్పుడు పొట్టకొచ్చి ఈనుతున్న వరిచేలై
తను పట్టిన గుణపంతో పొడుచుకొచ్చిన పండిన వరికంకులు
కుప్పనూర్చే కూలన్నల దాహం తీర్చే తన కన్నీళ్ళు వడ్లరాసులై
కాయాకష్టంతో ఎడ్లబండి నింపుకున్న తన నేస్తాలు ఎద్దులు
వీచే ఎండగాలుల్లో మార్కెట్ కు తరలించే తన బ్రతుకు గొంగటి కన్నీళ్లు నింపుకున్న వడ్లరాసులు,,,,,,
దళారీల ధన దాహం ఆకలికింత బువ్వ తినిపించి తన భుక్తి దోపిడీకి గురిచేసి
అవిశిపోయిన తన గుండె చప్పుడు వినే బహుదూరపు భారమయ బాటసారి రైతు,,,,,,,
మేడలు మిద్దెలు లేని విచ్చుకత్తుల బోను తను నిదురించే కుటీరం
కళ్లాకపటం తెలియని వింత జీవి నీ రంగుగుటద్దాలకు బువ్వ ముద్దలు తినిపించే గుర్తు తెలియని విచిత్ర చిత్రం రైతు పట్టిన నాగేటి సాళ్ళు మళ్ళీ మళ్ళీ,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం : ఈ రచన నా కలం సేత యని నా హామీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *