ఈ ఎర్రని ఆకాశం నిండా నేనే

అక్షర సమూహం
అంశం :నేటి పిల్లల ప్రవర్తన సామాజిక బాధ్యత
శీర్షిక :ఈ ఎర్రని ఆకాశం నిండా నేనే,,,,,,,!!
రచయిత అపరాజిత్ రెడ్డి

నిదురించే అవనిలోకి పొద్దు ఒకటి వచ్చింది
కళ్ళకు చిరునామా ఒకటే తొలిపొద్దు సూరీడు
నవాబుకైనా గరీబుకైనా వెచ్చని వెలుగు కిరణాలే ఆధారం,,,,,,,,,
ఆకలి గోకుతూ రోజువారీ కార్యాల్లో తలామునకలవుతున్న నిరుపేద తన్నుకుంటూ గుద్దుకుంటూ తనకు తానే అంగడి సరుకై తన భార్య పిల్లలకు నేర్పే బ్రతుకు తెరువైంది,,,,,,,,,,,,
ఏం చేయమంటావు సోదరా ప్రభాత సూరీడు ఆస్తమించే వరకు చెమటలు చిందిస్తూ రెక్కలు ముక్కలు చేసుకుని ఎర్రని ఎండల మంటల్లో ఈ నేల నిండా రక్తం మరకల ఎర్రగులాబీలు పూయిస్తూ సాగిపోయే బాటసారిని గరీబుని,,,,,,,,,,,
చదువుకున్నా ఎం ఏ పట్టా పుచ్చుకున్నా డబ్బులే లోకమైన ఈ అజ్ఞాన జనంలో నా చదువు కూడుపెట్టదు బండీపై బజ్జీలు అమ్ముకునే అనామకున్నయి పొద్దస్తమానం నాకు భార్యాపిల్లలకు అదేపని రోగమొచ్చిన పశువుల్లా,,,,,,,,,,,,
వెర్రిమొర్రి లోకంలో అక్షరం అన్నం పెట్టదు విజ్ఞానిని చేస్తుంది కనుక దుర్మార్గం చేయకుండా పొట్టపోసుకుంటూ ఒళ్ళు జల్లెడ చేసుకుని కాగేనూనెలో బలేబలే బజ్జీలు వేస్తున్నా,,,,,, ఇందులో బానే కమాయిస్తున్నా సుమీ,,,,,,,,,,,
రూపాయికి రెండు వైపులా ఎర్రని భగభగ మండే సూరీడు బొమ్మ వేస్తే ఎంతబాగుండో నా రక్తం ఉడికినట్లు నూనెలో బజ్జీలు ఉడికి నెత్తురు వాసనలో బజ్జీలు బహురంజుగా ఉండు,,,,,,,,,,,,,,
నా కళ్ళు రెండూ గరం గరం మసాలా బజ్జీలై తినేవాళ్ల కళ్ళనుండి రూపాయలు వసూలు చేస్తూ బహురంజైన బజ్జీల బేరం ఇన్నాళ్ళు ఎందుకు చదువుకున్నా బజ్జీల బేరం తెలియకనా ?ఏమో,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం : ఈ రచన నా కలం సేతయని నా హామీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *