స్త్రీ హృదయం

స్త్రీ హృదయం
అగాధం,అర్ధం చేసుకోడం
అనితరసాధ్యం
అంటాయి యుగాల చరిత్రలు……!
అవునా నిజమేనా !?అని అడిగాను
లోపలకు,లోలోపల,హృదయాంతర్గత లోయల్లోకి వెళ్ళి…..!
నా శ్రద్ధకు మెచ్చి
అప్పుడామె అంది…….
నన్ననన్నుగా అర్థంచేసుకుని
నాకు తోడుగా చేయపట్టుక నడిపించి,
నాదైన మనసును దగ్గరకు తీసుకొని
నన్ను నన్నుగా పసిపాపల లాలించి చూడూ
నేనూ నీ ఊహల తోటలో
కోయిలనవుతాను….
నీ మనః సరస్సులో
పద్మ మై విరబూస్తాను…..
నీ హృదయ మందిరంలో
బొమ్మనౌతాను,
నీ బొమ్మకు నే పూరెమ్మ నౌతానూ అంది ఆమె……!
అప్పుడు నే ననుకొన్నాను
అందుకే కామోసు………
అనార్కలి,పార్వతీ,వెనుక సలీం,దేవ దాసులు
చరిత్రలో నిలిచిపోయారు………..,,!
నా ఆత్మసాక్షి అంది
ఆమె ఎప్పుడూ పరాజిత కాదు….
యుగాలన్నిటిలో అపజయం చవిచూడని విజేత….!
వెనుకకు చూడని, మడం తిప్పని ధీర వనిత……!!
ఇప్పుడు నే ననుకున్నాను
చరిత్రలో నిలిచిపోవాలంటే
నేనుకూడా……..
సలీం,దేవదాసులను అనుసరించాలని……..,!!
🌹
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
9490125878

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *