అక్షర సమూహం
అంశం :నేటి పిల్లల ప్రవర్తన —–సామాజిక బాధ్యత
శీర్షిక :హృదయం పలుకుతోంది చరవాణిలో,,,,,,,,,!!
రచయిత అపరాజిత్ రెడ్డి
సామాన్యుని గుండెలోతుల్లో ధైర్యం ఊపిరులు ఉదుతూ
నిరాశ నిస్పృహల జీవన లోయల్లో హృదయం పాడే ఏదో తెలియని వింత మమకారాల చిగురింతలు,,,,,,,,,,,,,,,,
విషబీజాలు మొలకెత్తిన వృక్షాల లోకం నాలుకలు సుతిమెత్తని కత్తుల గారడీ నవ్వులు జిల్లేడు పూవుల మధ్య నిర్మల మానస హృదయం,,,,,,,,,,,,,,,,
సామాన్యుడు తెరచాటున దుఃఖం మింగుకుని చేదు జ్ఞాపకాలు సుడులు సుడులుగా మనస్సు పొరలను చీల్చుతూ ఆవేదన పెను గాయమైన కన్నీళ్ల కళ్ళకు నీవు పంపిన చరవాణి సందేశం ముఖం పూవై వికసించి హృదయం తెరుచుకుంది,,,,,,,,,,,,,,
సామాన్యుడు సంతకం చేస్తే అలగావాడు కాని ఆ సంతకం గుండె లోతుల్లోని లోయల్లో ఉడికిన రక్తం చిమ్మిన సిరా అక్షరాలు పలుకలేని ఆవేదనలు చరాచర జగత్తులో చరవాణి సృష్టించిన అలజడిలో అన్నీ కొట్టుకుపోవు,,,,,,,,,,,
లేత గులాబీలు మనోహరంగా ఒళ్ళంతా అలుముకున్నట్లు మనస్సు మౌన సంగీతం సన్నని రాగం వీణుల విందుగా చరవాణి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు ప్రతి కళ్ళల్లో తేనియల మధురిమలు ఆనందాల హరివిల్లులు జనసమ్మర్థంలో చిరునవ్వుల ఆహ్లాదం,,,,,,,,,,,,,,,,
మనస్సులోని సంవేదనల సమస్యల సంగతులకు చరవాణిలో సమాధానం దొరుకు సూత్రప్రాయంగా నిండు అమావాస్య రాత్రి జాబిలి విరిసినట్లు కళ్ళల్లో హృదయంలో కాంతులు విరజిమ్ము నిరుపేదల గుండెల్లో బ్రతుకు తృప్తి,,,,,,,,,,,,,,
ఆనందలహరి చిత్రవిచిత్రాల చిరుచిరు నవ్వులు హృదయం లోతుల్లోకెళ్ళి తట్టును సుందర చరవాణి చేతుల్లో ఉంటే ప్రపంచం పలుకరించును నిరుపేదల గుడిసెల్లో కన్నీళ్ళు కడిగివేసి రంగు రంగుల ఆకర్షణీయమైన అద్దంలో అలరింతలు కాసేపు దుఃఖంమాపు త్రిశంకు స్వర్గంలో,,,,,,,,,,,,,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం ఈ రచన నా కలం సేత యని నా హామీ