నేటి పిల్లల ప్రవర్తన – సామాజిక బాధ్యత

అక్షరలిపి అంశం
నేటి పిల్లల ప్రవర్తన – సామాజిక బాధ్యత

నేటి సమాజంలో పిల్లల ప్రవర్తనలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో పిల్లలు చక్కటి జ్ఞానం పొందుతున్నారు.
అదే సమయంలో వారి ప్రవర్తన, విలువలు, సామాజిక బాధ్యతలపై ప్రత్యేక దృష్టి అవసరం ఏర్పడింది.

నేటి పిల్లలు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, ప్రతిభ వంటి మంచి లక్షణాలను ప్రదర్శిస్తున్నారు. వివిధ రంగాల్లో వారు ప్రతిభ చూపుతూ దేశానికి గర్వకారణమవుతున్నారు. కానీ మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి వాటి అధిక వినియోగం వల్ల కొంతమంది పిల్లల్లో సహనం తగ్గడం, పెద్దల పట్ల గౌరవం లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మితృలతో సంభాషించడం తగ్గించి ఒంటరిగా జీవిస్తూ ఉన్నారు.
పిల్లలు చిన్న వయసు నుంచే సామాజిక బాధ్యత అనేదిఅలవర్చుకోవాల్సిన
అవసరం ఉంది.కుటుంబం, పాఠశాల, సమాజం పట్ల తమ కర్తవ్యాలను గుర్తించడం ద్వారా వారు మంచి పౌరులుగా ఎదుగుతారు. పరిశుభ్రత పాటించడం, పర్యావరణాన్ని కాపాడడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం,
ఇతరులకు సహాయం చేయడం వంటి పనులు కూడా సామాజిక బాధ్యతలో భాగమే. సమాజ సమస్యలపై అవగాహన పెంచుకొనవలసిన అవసరం పిల్లలకు ఉంది.
ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే పిల్లలకు
మార్గదర్శకులుగా ఉండాలి. పిల్లలకు విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పాలి. మంచి–చెడు మధ్య తేడాను వివరించి చెప్పాలి. మంచి జీవిత విలువలు నేర్పాలి. పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవ నిర్వహించడం ద్వారా పిల్లల్లో సహకారం, బాధ్యత పెరుగుతుంది.నేటి పిల్లలు సానుకూల దృక్పథం
అలవర్చుకోవాలి. అప్పుడే రేపటి సమాజం అభివృద్ధి చెందుతుంది. సామాజిక బాధ్యత కలిగిన పిల్లలే రేపటి బాధ్యతాయుత పౌరులుగా
మారతారు.
అందుకే కుటుంబం, పాఠశాల, సమాజం కలిసి పిల్లల్లో మంచి విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలి.

ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *