యువతా ఎటు వైపు నీ పయనం

అంశం : నేటి పిల్లలు సామాజిక బాధ్యత
శీర్షిక :యువతా ఎటు వైపు నీ పయనం!?
రచయిత అపరాజిత్ రెడ్డి

యువతా ఎటు వైపు నీ పయనం!?
వెలుగులోకా?చీకటిలోకా?
యువకుల అందాలు ఇనుమడించేది
శుభ్రంగ గడ్డం గీసుకుని మీసకట్టుతో
సంప్రదాయ ప్యాంటు,షర్ట్ లో
అందం, ఆనందం, అద్వితీయం!
గడ్డాలతో సహా మీసాలు గీసుకుని
రక రకాల క్రీములు ముఖానికి రాసుకుని
నూతనంగా వస్తున్న క్రీములు ఒళ్లంతా రుద్దుకుని
జుత్తు ఫ్యాషన్ పేరుతో పరమ దరిద్రంగా కత్తిరించుకుని
పక్కన నిలబడితే కొట్టొచ్చినట్లు గబ్బు వాసన
కనీసం ఆడ మగ తేడా అయినా తెలియని విధంగా!
యువతరం ఎటుపోతోంది?కనిపించని కాలం వైపరీత్యమా ఇది!?!
ఆడపిల్లలు ముఖానికి ఫౌడర్ రాసుకుని నుదుట బొట్టు రమణీయం
సరే లంగా ఓనీలు పోయాయ్!పంజాబీ దుస్తుల్లో ఫ్రీగా
అందంగా నాజూగ్గా అగుపిస్తే సరిపోదా!?!
విపరీత పోకడలతో రక రకాల క్రీములు,సెంట్లు పూసుకుని
ఒళ్లంతా అగుపించే దుస్తుల్లో చూడ్డానికే అసభ్యంగా
గుప్పు గుప్పుమని రక రకాల వాసనలతో
ఎటుపోతోంది ఈ తరం కారుచీకట్ల కనుసన్నల్లోకా?
ఇది చాలదన్నట్లు చెవుల్లో ఇయర్ ఫోన్లు శరీరమంతా వైర్లు
వీళ్ళు వినేదంతా చెత్త సాహిత్యం సంగీతం
పక్కవాళ్ళకేం వినపడదు కానీ వీళ్ళ ఆలోచనలు మురికి కాలువలు
యువతరం పెడత్రోవ పడుతున్నా
తల్లిదండ్రులు చూసిచూడనట్లు అదే ఫ్యాషన్ అని సరిపెట్టుకుంటూ
ఇలాగే కొనసాగితే ఒళ్లంతా దురదలతో క్యాన్సర్ లాంటి వ్యాదులు పొంచి ఉన్న ముప్పు
తల తిరిగి మెదళ్ళు మొద్దుబారతాయ్! తస్మాత్ జాగ్రత్త!!

అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం ఈ రచన నా కలం సేత యని నా హామీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *