ఎర్రమందారం సూరీడా రా తరలిరా,

తొలిపొద్దు పొడిచే వేళాయె
తూరుపు కొండలన్నీ ఎర్ర గొడుగులు పట్టుకున్నాయి
సూరీడును కప్పేసిన మబ్బులు ఎర్రని నిప్పుల కుంపట్లు,,,,,,
సముద్రం ఆవల సూర్యోదయం ఈవాల భయంతో చీకట్లు జారుకుంటున్నాయి,,,,,,,,,
చలిగాలులు పీల్చేసిన శరీరాలు గజగజ వణుకుతూ సూరీడు లేత సింధూరం కాంతుల్లో సేదదీరుతున్నాయి,,,,,,,,,,,,
ఆకలి కొరకే పుట్టినట్లు జనం ఆవురావురుమంటూ వేడివేడిగా చాయ్ లు టిఫిన్లు లాగించేస్తున్నారు కళాకాంతులు పట్టని దివాలుకోరు లోకం,,,,,,,,,,,
రైతులు ఎడ్ల మెడలపై అరకలు వేసుకుని తెల్లవారక మునుపే పొలం దారి పట్టారు,,,,,,,,,,,,
తొలిపొద్దు ఎర్రని కాంతుల్లో పూవులన్నీ వికసించి ప్రకృతి ఇంకా శోభిల్లుతోంది అవనీ తనయుడా భయపడకు,,,,,,,,,
రైతుకూలీలు తూరుపు ఎర్రని నిప్పుకణిక సాక్షిగా గుండెలు మండుతున్న సుట్ట తాగుతూ తెల్లవారు జామున ఊపిర్లు పోసుకుంటూ పొద్దస్తమానం శ్రమల జీవితాలకి తమకు తామే ఊరుకి సంజీవనీ పుత్రులు త్యాగధనులు మొనగాళ్ళు,,,,,,,,,,,
పేదరికంలో పెద్దయ్య ఖల్ ఖల్ మంటూ దగ్గుతూ తూరుపు ఎర్రని సూరీడుకు దణ్ణం పెడుతూ ఊపిర్లు వదిలాడు,,,,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *