వస్త్రాల విలువ

అక్షర కొరకు
అంశం – నేటి పిల్లల ప్రవర్తన
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – వస్త్రాల విలువ

వలువ తోనే విలువ
జానెడు బట్టను కొలువ
నేటి పిల్లల బట్టలు
కొలిచేటట్టే లేవు!

సగం సగం వస్త్రాలు
నిజం నిజం అస్త్రాలు
వేరు వేరు వలువలు
చూడ లేని రకాలు!

సమాజం లో ఆడవారి
వస్త్రధారణ మగ వారికి
కలిగించు కోరికల వెల్లువ
నిండైన బట్టలే స్త్రీకి అందం!

నేటి సమాజపు పోకడ
లేదు మనుషులకు నిలకడ
రావాలి మార్పు జనులకు
వస్త్రాల విలువ తెలుచుటకు!

ఆది మానవులం కాదు మనం
నాగరిత కలిగిన మనుషులం
పిల్లలకు సాంప్రదాయం నేర్పండి
పలు విషయాలు తెలుపండి!

ఇది నా స్వంత రచన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *