అంశం : నేటి పిల్లలు సామాజిక బాధ్యత
శీర్షిక :అమ్మాయి అంటే పిడిబాకు,,,,,!
రచయిత అపరాజిత్ రెడ్డి
మనదేశంలో చాలా వరకు అమ్మాయిలను నాజూకుగా
లోకం తెలియకుండా పెరుగుతున్న దుస్థితి
అమెరికా లాంటి దేశాల్లో అమ్మాయిలంటే అగ్గిపిడుగులు
మనదేశంలో ఆడపిల్లలు చదువుల సరస్వతులు కావొచ్చునెమో కానీ శారీరక దుర్బలులనడం శ్రేయస్కరం
అమెరికా అమ్మాయిలంటే అసలు సిసలైన క్రీడాకారులు కొందరు మార్షియల్ ఆర్ట్స్ లో సుప్రసీద్దులు,,,,,,,,,
ఆడపిల్లలు చదువులతో పాటు శారీరక దృఢత్వం కలిగివుండేందుకు,,,,,,
క్రమం తప్పకుండా వ్యాయామాలు నేర్పే సెంటర్లలో శిక్షణ పొంది ఆరోగ్యంగా వుంటేనే శారీరక మానసిక దృఢత్వం ఏర్పడి చదువు సంస్కారం సులువైతాయి,,,,,,,
మన దేశంలో పురుషులను మహిళలను వేర్పరిచి చూస్తూ మహిళల పాలిట యమకూపాలయ్యారు,,,,,,,,
అభివృద్ధి చెందిన దేశాల్లో ఆడది అబల కాదు అంటూ అన్ని రంగాల్లోకి ప్రవేశించి దూసుకెళుతున్న మాష్టర్ మైండ్స్ మరియు చిచ్చరపిడుగులు,,,,,,,
ఆడపిల్లలు ఐరెన్ శరీర సౌష్టవంతో దుష్టుల పట్ల సింహస్వప్నాలుగా ఎదగాలి,,, ,,,,
కష్టపడే తత్వం గల ఆడైనా మగైనా దుస్సంఘటనలు ఎదురైతే దునుమాడుతూ దూసుకెళ్ళే నైజం అంతేకాకుండా మనిషి కష్ట సుఖాలను
దూదిపింజలు చేసేది రోజు ఉదయం గంటసేపు చేసే కఠిన తరమైన వ్యాయామం ఆటలు,,,,,,
అందుకే ఉద్యోగం కన్న ఆరోగ్యం మిన్న,,,,,,గుర్తుంచుకో,,,,!!
అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం ఈ రచన నా కలం సేత యని నా హామీ.