చీకటి కమ్మిన జీవితాలు
చీకటి దుఃఖంలో నేటి రేయి ఎందరు అతివల బ్రతుకులు తిరునాళ్ళై కన్నీళ్లు ఇంకిపోయిన కళ్ళల్లో అగ్నిపూవులు పూస్తున్నాయో ఈ ఎడారి లోకంలో. చదువుల కల్పవళ్లులు తిండి తిప్పలు లేక ఆకలి డొక్క పీకుతూ చదువుకునే స్తోమత లేక గత్యంతరం లేక సెక్స్ వర్కర్లుగా జీవితాలను నాశనం చేసుకునే అభాగ్యులకు చేయూత నిచ్చేవాళ్లేరి ? ఈ రోదనలలో కొట్టుకుపోయే జీవితాలకు ఈ చీకటి రాత్రులలో అంగడి బొమ్మలు ఎన్నాళ్ళు ? వీళ్ళను గుర్తించి జీవన జ్యోతులు వెలిగించలేమా, ఆలోచించండి.
అపరాజిత్
సూర్యాపేట