కల

కల లంటే ఏమిటి?
సాలోచనగా
ఆలోచించాను…….!
కొన్ని ఘటనలకు
దృశ్య రూపకములా!?
మళ్ళీ…సావధానంగా ఆలోచించాను…….!
నాలో….. లోలో….సాలోచనోదయ మయింది…..
జీవాత్మ …..కనుపాపలలో
దాచుకున్న ప్రశ్నల
దృశ్యాలకు
సాకారంగా అంతరాత్మ……
ప్రదర్శించే జవాబుల రూపకాలని……!!
🩷
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
9490125878

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *