నా హృదయాంతరంగం,

నా హృదయాంతరంగం,,,,,,,!!

నా హృదయం ఎవ్వరికీ తెలియని పరిమళాల పూవుల సుకుమారి,,,,,,
సుదూర అంతరిక్షంలోంచి నా కోసం దిగివచ్చి ఎర్రని గులాబీలా నా ఎదగూటిలో అమరిందే నా హృదయం,,,,,,,,,,,,
హృదయం నిండా అనుభూతుల ఆహ్లాదాల అనుభవాల సంవేదనల పెనవేతల సుందర గోపురం,,,,,,,
హృదయం పూవుల అక్షరాలతో నిండిన కావ్యసంపుటాల కోయిల స్వరాల గలగలల గంగోత్రి,,,,,,,,
నా హృదయం తీయతీయని అక్షరాలతో వసంతాలకు దోసిలిపట్టి నీ కళ్ళు శోభిల్లేలా నీ హృదయం రంజిల్లేలా సాగిపోయే అక్షర సముదాయాలు నీ హృదయంలో గుమ్మరించే విచిత్రం,,,,,,,,,
అంబరంలో పూసిన నక్షత్రాల నిండా చందన సుగంధాల కవితలు వ్రాసి రంగు పూల వస్త్రాలు కట్టాను శోభిళ్ళేను సౌందర్య పిపాసుకుల హృదయాలు గుడిగంటలు మ్రోగేను,,,,,,,,,,
నా హృదయాంతరాళంలో జీవన చిత్రాల లయలను అక్షరీకరించి ఆ అనుభవాల సారం లోకమంతా చల్లితే భువిపై మొలకెత్తిన అంకురాలు కావ్యాలై మహావృక్షాలై ప్రాణవాయువులు అందిస్తాయి,,,,, ,,,,,,
నా కలంలో సిరా రక్తం నిండిన నా హృదయంలోనిది ఎర్రని తూర్పు సంధ్యలోంచి గ్రహించాను నీ కోసం రచియించే కావ్యం నీకు జీవిత సోపానాలు సృష్టి నిగూఢ కళా చరిత్ర అక్షరబద్దం చేసింది,,,,,,,
నా హృదయం లోని సిరలు రక్తకేషణాళికలు పోగులు పోగులుగా అల్లినవే నా అక్షరాలు కొత్త కొత్త దారుల వెంట ఉరవడిగా పరుగులెత్తే ఊపిరి భాష్యాలు,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *