అంశం
అక్షరలిపి సంక్రాంతి ప్రేమ లేఖల పోటీ
శీర్షిక
శ్రీ కృష్ణ పరమాత్మకు రాధ వ్రాసిన ప్రేమ లేఖ.
ప్రియమైన కృష్ణా,
నీవు నా కంటికి కనిపించకపోయినా, నా హృదయంలో నీవే ఉన్నావు. యమునా తీరంలో నీ వేణుగానం విన్న ఆ క్షణం నుంచి నా మనసు నీదైపోయింది. నీ చిరునవ్వే నాకు ఒక వరంలా అనిపిస్తుంది.
నీ మాటల్లో ప్రేమ ఉంది, నీ చూపులో అనురాగం ఉంది. నీవు పక్కన ఉంటే కాలం ఆగినట్లుగా అనిపిస్తుంది.
నా మనసు ఎప్పుడూ నిన్నే వెతుకుతోంది. నీవు చూపించే ఆ ప్రేమ స్వార్థం లేనిది.
కృష్ణా, నీవు నా హృదయంలోనే వసించు.
నీవు దూరంగా ఉన్నా, నీ మనసు నాకు దగ్గరగా ఉంటుంది. నా ప్రతి శ్వాసలో నీ నామమే ప్రతిధ్వనిస్తుంది. ఈ ప్రేమకు రూపం లేదు, పరిమితి లేదు. సదా నీ
ప్రేమలో
ఎప్పటికీ నీదైన,
రాధ
ఈ రచన నా స్వీయ రచన
వెంకట భాను ప్రసాద్ చలసాని