పల్లవించవా నా పాటలో,,,,!
కోయిల రాగంలా సాగే నీ గానం
నా మనస్సుకు ఆహ్లాదంగా సీతాకోకచిలుకలా తేలియాడుతోంది
రెండు నదుల సంగమంలా మనస్సు హృదయం ఏకమై పరవశనై ఉత్తేజితమైతి
ఈ ఎండల్లో తొలకరి జల్లులు వీచే చల్లని గాలిలా మృదు మధురం నీ గానం
మంటల ఎండల్లో కురిసే జోరువానలకు పులకరించిపోయే అవనిపై వృక్షాలు పశుపక్ష్యాదులు సన్నగా తీసే రాగం నీ గళంలో సాగే అద్భుత అమృత గీతం
శుశోభిత నిండు పున్నమి వెన్నెలలో పిల్లనగ్రోవి రాగంలో కలిపి పాడే విషాదగీతం హృదయాన్ని పిండివేయు
రంగు రంగుల పూవుల మద్య నుండి విరజిమ్మే పరిమళాలలో తుమ్మెదలు తీసే రాగంలా మనోహర మన్మధ గీతం రాగరంజితం,,,,,,,
చీకటి దారిలో చారవాణి లోంచి రఫీ పాడిన తెలుగు పాట వీణుల విందుచేస్తూ నా హృదయంలో పాడుతున్నట్లు వింతైన మూగ అనుభూతి
ఉషోదయంలో కదులుతున్న మబ్బుల కింద ఎగురుతున్న పక్షులు లేత సూర్యకిరణాలలో సుప్రభాత గానం మైకులోంచి శబ్దతరంగాలు మానవాళికి దృశ్య శ్రవణ కళారూపం
పశువుల మందలు తోలుకుపోయే కొండన్న పాడే జానపద గీతం ఎంకిపాటలా హృదయంలో గెలికినట్లు ఏదో అలజడి
పాట పాలపిట్టంత అందంగా మనోతటాకంలో అలలు అలలుగా హృదయాన్ని మీటే వీణలా సాగాలి
అపరాజిత్
సూర్యాపేట