ప్రేమలేని కాంక్ష నిస్తేజం

ప్రేమలేని కాంక్ష నిస్తేజం

నీ కళ్ళు గుండెల్లో గుచ్చుకునే శూలాలు
నా హృదయంలోకి తొంగిచూస్తున్న ముక్కంటి మృణాళినివి శివాత్మజవు,,,,,,,
కుదురుగా దిద్దుకున్న ఎర్రని బొట్టు ప్రేమలల్లిన రూపసివి
నీ కోలముక్కుకు పెట్టుకున్న నునుపైన ముక్కుపుడక ఎన్నెన్నో నిగూఢ అనుభవాల సారంగివని అగుపిస్తోంది,,,,,,,,
ప్రేమ ఊసుల జోలలెన్నో పాడిన వికసించిన మోము తెల్పుతోంది,,,,,,
నీవే నా ప్రేమైక సింధూరమని తెలిసిన క్షణం నుండే నీ కనుపాపలలో నేను సైయ్యాట లాడుతున్నానా ఏమో,,,,,,,
బహుశా నేను చంచల స్వభావిని కాబోలు,,,,,,,
మరి నీవేల నా ఆకర్షణలో అచంచల దీక్షతో నన్ను నన్నుగాకుండా కాలవరపెడుతున్నావు,,,,,,,,,
నీ అందమైన మోముపై నును వెంట్రుకల బాసలు చెబుతున్నాయి,,,,,,,,,
నా మనస్సు కౌగిలిలో బంధీవై నా యవ్వన ప్రేమకాంక్షను నిద్రలేపుతున్నావని,,,,,,,,
నీవు ఉసులాడే ప్రేమ కాంక్షలో నన్ను దోచుకునేలా చురుక్కు చురుక్కుమనే తీవ్ర కాంక్షా చూపులేల నారీశిఖామణి,,,,,,,
ప్రేమలు సుకుమార హృదయ సౌందర్య ఆలాపణలో వుంటుంది,,,,,, కాంక్షలో ప్రేమలేల లాలసీ,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *