శ్రీనివాస్ రామడుగుల(కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు, భోపాల్ లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు)

శ్రీనివాస్ రామడుగుల పూర్తిపేరు రామడుగుల వెంకట సత్య సూర్య శ్రీనివాస్. తెలుగు యువకవులలో ఒకరు. ఇతని కలం పేరు “శ్రీ”. కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు.
రామడుగుల సీతారామం, సూర్య గంగాధరం దంపతులకు 1968 జనవరి 11న తూర్పు గోదావరి జిల్లా రంగాపురం గ్రామంలో జన్మించాడు.

ప్రస్తుతం భోపాల్ లోని దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు.
ఇతని వివాహం సత్యలక్ష్మితో జరిగింది. ఇతనికి ఒక కుమార్తె (సింధూజ).

“శ్రీ వాక్యం” (ఏక వాక్య కవితల సహస్రం) 2013 సెప్టెంబరు 1 న విశాఖపట్టణంలో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
“మనసంతా నువ్వే” (దీర్ఘ కవితల సంపుటి) 2014 జనవరి 11 న హైదరాబాదులో సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.

2013 సెప్టెంబరులో విడుదల చేసిన శ్రీవాక్యానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి అవార్డు 2014 సెప్టెంబరు 1న హైదరాబాద్ లో.
“ప్రేమను ప్రేమించు ప్రేమకై” గ్రూప్ లో కవితలకి ప్రథమ బహుమతి ఒకసారి, ద్వితీయ బహుమతి మరోసారి.
తిరుపతి దేవస్థానం వారు నిర్వచించిన పురాణ ప్రబోధ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో వెండిపతకం (1982లో ).

“ఏకవాక్య కవితా విశారద” విశాఖపట్టణంలో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారిచే. 2013 సెప్టెంబరు 1న బహూకరించబడింది.
తెలుగు వన్.కాంలో ప్రత్యేకమైన రోజులలో కవితలు చాలా ప్రచురించబడ్డాయి.
సేవ పత్రికలో కొన్ని ప్రచురించబడినవి.
NATA వారు ఇప్పటివరకు ప్రచురించబడిన రెండు సంచికల లోను కవితలు ప్రచురించబడినవి.
తెలుగు వెలుగులు పత్రికలో బెంగళూరు తెలుగు పత్రికలో ఆస్ట్రేలియా వారి పత్రికలో కవితలు ప్రచురించబడినవి
ఏక వాక్య కవితలు 3500 ఇప్పటికి వ్రాయడం జరిగింది.ఇదొక రికార్డు తెలుగు సాహితీ చరిత్రలో.
దీర్ఘ కవితలు సుమారుగా 250 వరకు రచించాడు
ద్విపాద కవితామాలికలు సుమారు 1500 దాకా రచించాడు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *