స్వరములు

అక్షర సాహితీ సమూహం
అంశం : చిత్రకవిత
శీర్షిక : స్వరములు,,,,,!

వేణువై పాడాలి నీ గొంతులో
సరిగమలే మీటాలి కొనగోటితో
రాగాలతో జతకలపాలి నేను తీయని వీణనై
గోపిక కృష్ణులమై రంజిల్లాలి హృదయానందంలో
రాగాల సిరుల్లో నీ కనుపాపలు కాస్త మత్తిల్లాలి
చిగురాకు నెమలి పించం ఆహ్లాదంగా ఆడు సప్తస్వరాలలో
మనస్సు వెన్నముద్దలు తింటున్న గోపీలోలుడవును
ముంగురుల ముంగిళిలో మురళీరవం
నీ తోడుతోనే నా హృదయం మహాసముద్రం
అమృతం గ్రోలుతున్న భావన మన ఇరువురి రస రాగాల సంగమం
మన ఇరువురి మధ్య పలకరింతైనా లేదు తీయని రాగాల అనురాగాల మత్తకోయిలలై
మన పిచ్చిగాని తీయందనాల కోటి రాగాలు మీటినా
ఈ ప్రపంచం పట్టించుకోని ఆదరబాదర జీవనయాత్ర
నింగి నిండా నక్షత్రాలు పూర్ణచంద్రుడు తెల్లని మల్లియలు తనివితీరా కురిపిస్తున్నాడు వెన్నెలలై,,,,,,,,
సగరాల సంగమంలా మన సంగీత విభావరి ఎవరికి కావాలి!?!
ఏ ఒక్కరి హృదయం కదిలించినా మనం ధన్యులం,,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట

హామీపత్రం ఈ రచన నా కలం సేత అని నా హామీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *