కం!!🌺🌺🌺🌺

ఎలమి తెలివిగల మనుషులు
విలువయిన సమయము కొరకు విధిగ నిలువకన్
తలపునను గల సమయమును
మలచుకొనెదరు ఋషులు వలె మరువక కృష్ణా!!

ఆ!!వె!!!!🌺🌺🌺

పిచ్చివారిపైన ప్రేమను గురిపించ
మంచివారు దూరమౌను, కనగ
ఆచితూచియెపుడు నడుగేయ మేలని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *