ఆహుతికై ఆరాటం

ఆహుతికై ఆరాటం

నా కళ్ళ చుట్టూ గోడలు కట్టుకున్నాను
నేను నించున్న చోటే కృంగిపోతూ ఇక సెలవంటూ,,,,
నన్ను నేనుగా జీవించలేని సమాజం వెర్రితలల్లో ఆహుతి చేసుకుంటూ,,,,,,,,
నా అక్షరాలన్నీ గాలిపటాల్లా ఎగిరి ఎగిరి ఒక్కసారిగా సప్పున అణిగిపోయి నీవు లేనిదే మేమెందుకు ప్రియతమా అంటూ మాయమవుతున్నాయి,,,,,,
నా విధిరాత ఒకటైతే నా ఆలోచనలు సృజనాత్మకం నన్ను నేను మార్చుకోలేని నిస్సహాయుణ్ణి,,,,
ఈ ప్లాస్టిక్ రంగుల హంగామాలలో అర్థం లేని వికృత జీవితంలో మనలేక ఇక నిష్క్రమణమే తరువాయి,,,,
ఇప్పుడప్పుడే తొందరపెట్టకు నా మాహాభినిష్క్రమన మప్పుడు నీకు కబురంపుతాలే,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *