ప్రియా!
నీ కళ్లల్లో అధ్బుతమైన కమ్మని మాయా మత్తు కలిగించే అమృతమేదో ఉందేమెా!
చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండి పోవాలనే కోరిక కలుగుతుంది..
ఎంత సేపని అలా చూస్తూ గడిపేయను? ఆకలి దాహం ఏదీ గుర్తుకు రాదే?
ఆ కళ్లల్లో అంత పవరేంటో? నాకసవు అర్థం కాదు..
కళ్లే అలా ఉంటాయనుకుంటే ఆ అధరాలు తీయని మధువొలకబోస్తూ తేనె ను అందిస్తూనే ఉన్నాయి ఆ తీపి మధురిమను గ్రోలుతూ ఇక ఆకలనే పదం తెలియకుండా ఎన్ని రోజులైనా ఇలాగే గడపవచ్చేమెా!
కానీ ఈ లోకం ఉందే! మనలను అలా వదిలేయదు కదా!
అబ్బా! పిలుపు వచ్చేసింది వదలక తప్పడం లేదు..
ఇన్ని రోజులు ఈ లోకం లోకం లోని మనుషులే మన శత్రువులనుకున్నా! కానీ ఈ ప్రాణం లేని ఫోను కూడా ప్రాణమై పిలిచింది పెద్ద శబ్దం చేస్తూ!
ఇక తప్పదు ప్రియా! నిను వీడక..
ఒకసారి మ్రెాగి ఊరుకుంటుందేమెా అనుకుంటే అలా ఊరుకోవడం లేదు..
నన్ను క్షమించు నేస్తమా! నిను విడిచి వెళ్లి నందుకు..
వస్తా మరి..
నీ రాము..
ఉమాదేవి ఎర్రం..
ఇది నా స్వంతమే!