దురాలవాట్లను దూరం చేసుకో

దురాలవాట్లను దూరం చేసుకో

అక్షరాలన్నీ కాచి వడపోసి
నీకోసం రాస్తున్న సందేశ గీతం
పొద్దస్తమానం పనిచేసే కూలన్న
సాయంత్రం చీఫ్ లిక్కర్ తాగనిదే శరీరం విశ్రమించదు
ఎటువంటి బడలిక లేని నీవు ప్రతిరాత్రి తాగడం దేనికి ?
ఒళ్ళు బలిసి నీకై నీవే కొట్టుకున్నట్లు,,,,,
కూలీ చేసేవాడు తాగినా రోజువారి సరుకులు ఇంటికి తీసుకెళ్తాడు,,,,,
నీవో ఇల్లు ఒళ్ళు గుల్లచేసుకుంటే
భార్య పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే
నీ నెలజీతంలో సగానికి సగం జల్సాలకే పెడుతూ కొంప కొల్లేరు,,,,,,
నీకంటే కూలివాడు నయం సంసారం సజావుగా సాగదీస్తూ ఇంటిల్లిపాది ఆనందంగా ఉన్నారు,,,,,
ప్రతి రోజు నీ కుటుంబంలో గొడవలు నరకం చవిచూస్తూ తాగుడుకు బానిసవు,,,,,,
కష్టపడే కూలన్న శరీరం దేనికైనా తట్టుకుంటుంది
మరి నీ శరీరం ఊబకాయం దిశగా షుగర్ బీపీలతో మొదలై కాన్సర్ లాంటి వ్యాధులకు నీవు బలియైపోతే,,,,,,,,
నీ కుటుంబం రోడ్డునపడి పిల్లల చదువులు గంగపాలై
నీ భార్య పిల్లలను పోషించలేక కూలీనాలి చేసుకునే విగతజీవి,,,,,,,
నీవైనా నేనైనా మధ్యతరగతి బ్రతుకులు వెళ్లదీసేవాళ్ళం,,,,,
ఈ దురాలవాట్లు మనుష్యులకు స్లోపాయిజన్ మనిషి రక్తమాంసాలను క్రుంగదీసి పీల్చిపిప్పి చేస్తాయి,,,,,,,
ఇకనైనా మారవోయ్ సోదరా దూరవాట్లకు బానిసకాకు,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *