వీర సైనికుడా,,,,,,,,!!
సైనికుడా మంచుకొండల్లో వీచే నరాలు కొరికే చాలిగాలుల్లో ఒంటరివై ప్రాణం ఉగ్గబట్టుకుని దివారాత్రులు సరిహద్దుల్లో సంచరించే వీరుడా,,,,,,,,,,
దేశభక్తికి ప్రాణం పోసిన వీరుడా సమయానికి ఆహారం అందకున్నా వీచే చాలిగాలుల్లో ప్రాణవాయువు కరువు ఎందుకంటే అతి ఎత్తయిన శిఖరాలు కదా విహంగాలు కూడా సంచరించవు ,,,,,,,,,,,,,,,,,
సైనికుడా చలిమంట కూడా వేసుకోలేని స్థితిలో దివారాత్రులు తల్లిదండ్రులు భార్యాపిల్లలను ఎక్కడో వదిలి మొబైల్ లో వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా లేక ఎవరూ లేని ఏకాకివై హెలీకాఫ్టర్ లో వచ్చే తన సహచరుల కోసం ఎదురుచూపులు,,,,,,,,,,,
చలిగాలుల తీవ్రతకు ఒకోసారి ప్రాణాలమీదికి వచ్చే ప్రమాదం
ఉగ్రవాదులని తీవ్రవాదులని సైనికులనే టార్గెట్ గా క్షిపణులతో దాడులను ఎదుర్కొంటూ డేగ కళ్ళ మధ్య జీవితం ప్రమాదం పొంచివున్నా మొక్కవోని ధైర్యం గుండెల నిండా నీవే ఓ దేశానివి కత్తులబోనులో దేశ సరిహద్దు కాపలా ప్రాణాలకు తెగించి చేసే కవాతు,,,,,, వీరజవాన్ నీవు మా ప్రాణాలు కాపాడే దైవానివి నీవేలేకపోతే దేశం గుండెల్లో మరఫిరంగులు యుద్ధ విమానాలు దేశాన్ని శత్రుదేశం కబలిస్తుంది,,,,,,,
పుడితే యావత్తు దేశాన్ని రక్షించే వీరసైనికునిలా పుట్టాలి పనికిమాలిన రొటీన్ జీవితాలు దేనికి ఒకసారి ఆలోచించండి,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట