అక్షరాలు వెన్నెలలు

అక్షరాలు వెన్నెలలు

మంచి సాహిత్య అధ్యయనం మనస్సు పూసిన ఇంద్రధనస్సు.మనస్సు వెన్నెల సముద్రమై వసంతాలన్నీ నీకోసం దిగివస్తాయి. అప్పటి వరకు నిన్ను చుట్టుముట్టి ఏకాకిని చేసిన దుర్దినాలు తొలగిపోతాయి. జీవితంలో అనుభవించిన దుఃఖిత కారుచీట్లు తొలగిపోతాయి.
సంక్లిష్ట సమస్యలను కుశాగ్రబుద్దితో సులువైన మార్గాలతో పరిష్కరిస్తావు.నీవే జాబిలి నీవే వెన్నెలలా మంచి పుస్తకాలు, మానవతా విలువలున్న సాహిత్యం అధ్యయనం చేయి.నీ హృదయంలో రంగు రంగుల గుభాళించే పూవుల స్వచ్ఛతను ఆహ్లాదాన్ని నింపుకో.సోమరితనం మత్తువదలి అక్షరాలతో సహవాసం చేయి, ఉద్రేకం ఉన్మాదం సద్దుమణిగి జీవితం సెలయేటి గలగలల్లా సాగిపోతుంది.

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *