అగ్నిపూవుల జీవితం

ఎరుపెక్కిన పూవులు అక్షరాలు

ఎరుపెక్కిన పూవులు అక్షరాలు

గుండెల్లో శూలం గుచ్చుకున్నట్లు
కళ్ళల్లోంచి కన్నీటికి బదులు రక్తం శ్రవిస్తున్న చప్పుడు,,,,,
కళ్ళల్లో ఎరుపెక్కిన అక్షరాలు ఎర్రమల్లెలు,,,,,
వేళ్ళల్లో కలం పొసగక బలహీనమైన కరములు కర్రలు,,,,,,
మనస్సు గూడులో నిక్షిప్తమైన నా అక్షరాలు బయటకు రాక నానా అవస్థలు,,,,,,
నేను నీ గుండెల్లో గురిచూసి తూటాలు పేల్చినట్లు అక్షరాలు ప్రతిధ్వనిస్తే లక్ష్యం సిద్దించినట్లు,,,,
నా కవిత్వం వీణుల విందుగా గాక ఆలోచింపజేష్తుంది,,,,,
నీ మనస్సు ఎడారి ఇసుక సముద్రం మంటల్లో ఎడారి ఓడనై అక్కున చేర్చుకుని దిశానిర్దేశం చేస్తాను,,,,,,
ఎన్నెన్నో కలలు కల్లలైనా స్మృతి వనంలో నా కళ్ళు రచించే అక్షరాలు తిమిరాలకు చరమగీతాలు,,,,
ఈ అగ్నిమంటల గుండెల్లో ఎర్రగులాబీలు పూసేది నీ ఆత్మసంఘర్షణ దూరం చేసేందుకు,,,,,,
దేశానికి స్వాతంత్య్రం సాధించిన యోధులు అమరులై పక్వమైన ఫలాలు అందించారు,,,,,,
కవుల కలాల్లో అక్షరాలు పూసేది భారతావని నందనవనం చేసేందుకు,ఆకలి కేకలు లేని సుందర భరతఖండం కోసం,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *