శాంతిగాబ్రతుకుదాం

ప్రియమైన
అందరికి
శుభోదయం.
మన
గణ తంత్ర దినోత్సవ
సందర్బంగా
నా హృదయ పూర్వక
శుభాకాంక్షలు.

వాయు
రేణువు లారా
వేణు గానం
అవుదామా….
ప్రజా రాజ్యం లో
రాణుల్లా….
రాజుల్లా….
విశ్వ వీదుల్లో
ఎగరేద్దామా
మువన్నెల జెండాను
రెప రెప లాడేలా….
హద్దులు దాటి
సరిహద్దులు
చేరిపేద్దామా….
అందామా
ఎవరు ఆపుతారు
మనల్ని
అని అందామా…
శాంతిగా
బ్రతుకుదామా…
స్వేచ్ఛతో వెలుగులు
నింపుదామా…

నింగి లోంచి
చూసిన
ఒక
భారత మాత
చల్లని హృదయంతో
వెన్నెల మనసుతో
నింగిలోంచి
భూమి తల్లిని చూసింది
ఎల్లలు లేని
అడ్డం రాని
హద్దులు చూసింది
మానవత్వం
నింగితో…
నేలను కలిపి
విరబూయాలని
కలలు కంది
వాటిని
నిజం చేద్దామా…
అందుకే
మనం అందాం
మనసా వాచా కర్మేణా
హమారా భారత్ మహాన్ హై
సారే జహ సే అచ్చా హిందూస్తా హమారా
అని మళ్ళీ మళ్ళీ
అంటూ…
జండా ఊంచా రహే హమారా
ఉండాలి
రెప రెప లాడాలి
విశ్వ వీదుల్లో
అవదుల్లేని
హద్దులు మీరని
స్వేచ్చ తో
విహారిద్దాం
శాంతిగా
బ్రతుకుదాం

మీ
అల్లావుద్దీన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *