వాండ్రంగి రామారావు, తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, ఆకాశవాణి ప్రసంగికుడు)

భావశ్రీ (వాండ్రంగి రామారావు) (26 జనవరి 1935 – 3 డిసెంబరు 2021) తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, ఆకాశవాణి ప్రసంగికుడు.

భావశ్రీ 1935, జనవరి 26న శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు. ఈయన స్వగ్రామం గంగువారిసిగడాం మండలంలోని సంతవురిటి గ్రామం. ఈయన తండ్రి సూర్యనారాయణ సమాజ సేవకుడు. తల్లి అమ్మన్నమ్మ, గృహిణి.

తెలుగు భాషలో ప్రత్యేక బి.ఎ డిగ్రీతో ఉత్తీర్ణుడైన భావశ్రీ తెలుగు, సంస్కృతంతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలో కూడా ప్రవేశం ఉంది. వాండ్రంగి రామారావు 3 డిసెంబరు 2021న తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్వగ్రామం జి.సిగడాం మండలం సంతవురిటిలో స్వగృహంలో మృతి చెందారు.

“తెలుగుజాతి నాది” “తెలుగు సంస్కృతి నాది” “నాకు అనేక భాషలు వచ్చినప్పటికీ నేను తెలుగు కవినే” అని చెప్పేవారు భావశ్రీ. ఈ మాటలు ఆయనకు మాతృభాషపై ఉన్న అచంచల అభిమానానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఆయన జీవితం అంతా సాహిత్యంతో ముడిపడి ఉంది. అనేక విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఈయన రచలలపై పరిశోధనలు చేస్తున్నారు. ఈయన “ఆంధ్రప్రదేశ్‌ సాహితీ సాంస్కృతిక శాఖ”కు అధ్యక్షునిగా పని చేశారు.. ఈయన ఈ శాఖ సభ్యునిగా రెండుసార్లు, అధికార భాషా సంఘం సభ్యునిగా మూడు సర్లు ఉన్నారు. ఈ నాటికి కూడా ఆయన సాహిత్యసెవలు కొనసాగిస్తూనే ఉన్నారు.

ఆయన సాహిత్య రంగంలో 120 కంటే ఎక్కువ భావనలు పద్య, గద్య, నాటక, సమీక్ష, గజల్, కవితలను వ్రాసారు.
“డి.డి-1″లో ప్రసారమైన “పద్యాలతోరణం”లో భాషానైపుణ్యం వుపయోగించిన మొదటి వ్యక్తి.
నాగార్జున విశ్వవిద్యాలయం ఈయన వ్రాసిన ఆరు పుస్తకాలకు ఎం.ఫిల్ యిచ్చింది.
ఈయన పాలకొండలో జరిగిన ఘంటశాల యొక్క 90 వ జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *