తనువుల తన్మయత్వంలో
ప్రేమ గులాబీలు విరిసినవి
ద్విగుణీకృత తమకంతో ఇరువురు
యవ్వన పుష్పాల ప్రేమ ఆస్వాదనలు
ఒకరిలో ఒకరు రంగరించి పోసుకుంటూ
ప్రేమల ఆలింగనాల్లో ఇరువురు
యవ్వన తమకంతో ఐక్యమయ్యేందుకు
నరాలు జివ్వుమనే కోరికలో
ప్రేమ అశ్వాలైన కామజ్వరంలో
ఉసిగొలిపే తనువుల తన్మయత్వం
మాటలు లేని మన్మథ తాపం
హృదయాల్లోని జీవామృతం ఆస్వాదనలు
ఇరువురు తీవ్ర ప్రేమ గ్రంథసాంగులు
ఇరువురి స్వేదం ఐక్యమవుతూ
ఉన్మాదుల్లా ఒకరినొకరు అల్లుకుపోతూ
ప్రేమలనే జీవంలేని మృగాల మల్లే
ఐక్యమయ్యే ఆరని కోరికల మంటలు
పూసిన పూవులపై తుమ్మెదల్లా
రంజుగా తేనియలు గ్రోలు తుమ్మెదల్లా
సంగమించేందుకు ఉద్రేకంతో ఊగిపోతూ
ప్రేమల బాసల బిగికౌగిలిలో
ఏవి ఉషస్సులు ?ఏవి అస్తమయాలు?
శరీరాలు తీసే కూనిరాగాల్లో
ప్రేమలు దారి తప్పిన కామజ్వరాలు
యవ్వనం పూసిన పసిడివన్నె రామచిలుకలు
రంగు రంగుల పూవుల అల్లికలు
ప్రేమలు కొసరి కొసరి అందించు చిలుకలు
అపరాజిత్
సూర్యాపేట