కోడూరి కౌసల్యాదేవి(కథా, నవలా రచయిత్రి)

కోడూరి కౌసల్యాదేవి (ఆరికెపూడి కౌసల్యాదేవి) సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి. ఈవిడ జనవరి 27, 1936లో జన్మించారు. ఈమె 1958లో ‘దేవాలయం’ అనే కథ ద్వారా రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టింది. ఈమె మొదటినవల “చక్రభ్రమణం”ను 1961లో తన 25వ యేట వ్రాసింది. ఈ నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతిని గెల్చుకుంది. ఈ నవలను డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమాగా తీసారు. ప్రేమనగర్, చక్రవాకం, శంఖుతీర్థం నవలలు కూడా అవే పేర్లతో సినిమాలుగా వచ్చాయి. వివాహం అయ్యాక ఇంటిపేరు ఆరికెపూడిగా మారినతర్వాత తనపేరును ఆరికెపూడి(కోడూరి)కౌసల్యాదేవిగా ప్రకటించుకుంది.

రచనలు

అనామిక
అనిర్వచనీయం
కల్పతరువు
కల్పవృక్షం
కళ్యాణమందిర్.

కథాసంపుటాలు

ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి కథలు
సుప్రభాతం
కల్పన
తీయనిశాపం
శోభకృతు
విద్య
చెట్టూ – ఛాయా

కథలు

1+1=?
అందని ద్రాక్షపళ్లు
అమ్మమ్మగారూ – ఆపిల్ చెట్టూ
ఆశాకిరణాలు
ఆశ్రయబంధం.

1961 – ఆంధ్రప్రభ నవలల పోటీలో మొదటి బహుమతి
1967 – గృహలక్ష్మి స్వర్ణకంకణము.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *