తారచంద్రుల తనువులు పాడే గీతాలు,,,,,,,!!
నీలి నీలి గగణం తన కుటీరంలో
పట్టుపానుపు వేసి చక్కని చమక్కుల తార
నవ యువ్వన చంద్రుడిని రారమ్మని ఆహ్వానించగ
వెన్నెలలు పూసే నూనుగు మీసాల చంద్ర కిషోరుడు
అందాలొలుకు ఆనందాల నవయవ్వన సుందరాంగుడు
ప్రేమ నిండిన కామకోరికలు ఇరువురిలో
ఉవ్వెత్తున ఎగిసిపడుతూ రతీకూజితాలలో
నీలిగగణం దుప్పటి కింద తేలియాడే
స్వర్గపుటూయలలు ఊగుతూ
సమస్త లోకాన్ని మరచి సొగసు పూల సుగంధాలు
ఆస్వాదించే వెన్నెల వర్షం వసంతాలలో
మైమరిపించే ఆ రతీ మన్మధుల సంయోగంలో
కోర్కెల అశ్వరూఢులై పులకరింతల పూనకంలో
జలతారు వెన్నెల అల్లిన జలజల జల్లుల స్వేదం
దేహాలను తడుపుతూ
సుఖమోహన వీణారాగం పాడుతూ
సుందరమైన ఆ రేయి మానవుల జన్మజన్మలు కథలుగా చెప్పుకుంటూ
కాలం గీసిన యుగాల సరిహద్దులు దాటి
మల్లెల మకరందాల వెలుగు పూవుల వెన్నెలలు
భువిపై మానవుల జీవితంలో రతీ రమ్యత ప్రాముఖ్యత
స్త్రీ పురుషుల మధ్య శృంగారం సుఖయోగం
సరిగమల సంసారం సుఖమయం
కాని యథేచ్ఛగా కలిసే విశృంఖల శృంగారం
జీవితాన్ని కృంగదీస్తూ పూర్ణ చంద్రుడు తరుగుతూ పెరుగుతూ అవస్థలు పడే ఆవేదనలు వర్ణనాతీతం
మానవులు కట్టుబాట్లు నీతి నియంత్రణలకు ప్రబోధాలు
పృథ్వి అస్తిత్వం దాకా కొనసాగుతూ
సత్యం శివం సుందరం ఋషుల ప్రబోధాలు
ఈ లోకంలో ఎల్లప్పుడూ నిలిచిపోయే వృత్తాంతం
జీవన విలువల లోతును దర్శింపజేయు కథా కవనం,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట