విరబూసిన ప్రకృతి కాంత
పక్షుల గొంతులో కొంగుబంగారం
పూవుల గుత్తులలో కాంతివర్ణ పుష్పాలు
గోరొంకల లేత గొంతులో తడి ఆరని రాగాలు
పసుపుపచ్చని బంగరు రేకులు పూవుల
గుండెలను మీటి వసంత రాగాలు పలికించిన చందం
పుప్పొడి వెదజల్లే విరబూసిన పూవుల కోమల పరిమళాలు
ఇంతుల కురులలో పూవుల లతలు ఆహ్లాదం గొలుపు
పురుష పుంగవుల హృదయాలను దోచు అందాల పూల రాశులు లాలసలు
లలనీమణులు కోయిల రాగాలలో హుషారెత్తు వసంతలక్ష్మి
గగణంలో విహరించే పక్షులు శోభిల్లే ప్రకృతి రమ్యతకు విస్తుబోయి సోలిపోయి వాలిపోతున్నాయి,,,,,,,
అందాలుచిందే రమనీమణులు విప్పారిన పక్షుల రెక్కల్లోని శక్తి మల్లే
తమ రెక్కల బలిమితో ఇంటిపనుల్లో ఉద్యోగాల్లో వయ్యారాలోలకబోస్తూ పురుషులను అధిగమించే ఇంతులు
పూవులు మహిళలు బహుకోమలంగా నయగారాల నయణాలతో హృదయాలను కోసే జానలు,,, ,,,,,,
నీ జీవితం సాఫీగా సాగాలంటే స్నేహం మహిళతో చేయి ఆమెపై శత్రుత్వం పెంచుకున్నావో నీ బ్రతుకవుతుంది బందరు జాతర,,,,,,,
భగవత్ ప్రేమ స్వరూపాలు పూవులు మహిళలు మీటీనా కొలది రాగాల సరాగాలు వెండి వెన్నెలలు,,,,,,
అపరాజిత్
సూర్యాపేట