రచన – ఉమాదేవి ఎర్రం
శీర్షిక – ఆడపిల్లలు
ఒకప్పటి ఆడపిల్లలు
వంటింటి కుందేళ్లు
ఇప్పటి ఆడపిల్లలు
ప్రతి ఇంటి దీపాలు!
ఆనాడు ఆడపిల్ల
చదివితే తప్పు
ఈనాడు ఆడపిల్ల
చదవకపోతే ముప్పు!
చదువుల సరస్వతులే
నేటి ఆడపిల్లలు
ఓనమాలు రాని బాలికలు
నాటి ఆడపిల్లలు!
ప్రతి రంగంలో మహిళ
సాధించింది విజయం
అబల కాదు సబల ని
నిరూపించింది ఆమె జయం!
ఇప్పటి బాలికలు
రేపటి నాయకులు
దేశాలనేలే చిరు నవ్వులు
పసి బాలలను కాపాడుకుందాం!
చిన్నారి పువ్వులను
చిరు చిరు నవ్వుల ను
వాడి పోనీయకుండా
ఏ కాలు కిందా నలపకుండా చూద్దా