అనాది నుండి నవశకం దాకా
అతి పవిత్రమైనది సోదర సోదరి బంధం
జనబాహుళ్యంలో ఇది నాలుకలపై కడలాడుతూ
కల్మష భూయిష్టమైనది సోదర సోదరీ సంబంధం
జనం పెరగడం జంతు సంబంధాలు
మనిషి జీవన లోలోతుల వరకు కూలిపోతున్న నవీనయుగం
కట్టుబాట్లు నియమ నిబంధనలు ఏట్లో కొట్టుకుపోతున్నాయి
నీ గోతి నీవే తవ్వుకుంటున్న రాక్షస ఆనందం
పెడదార్ల లోకంలో ఆదర్శంగా జీవించడమే గగణమైంది
ఒక కొమ్మకు పూసిన రెండు పూవుల్లా అన్నా చెల్లి కలివిడి పవిత్ర మానవత
అందుకోసం సోదరి సోదరుని చేతికి అలంకరించే రాఖీ
రాఖీ పౌర్ణమి పండుగ సహోదరత్వం కాపాడే పురాతనం నుండి ఆచరిస్తున్న
పూచిన రంగు రంగుల హరివిల్లు సోదర సోదరీ బంధం
సోదరి కోసం ఎన్ని త్యాగాలైనా జీవితాంతం చేసే సోదరుడు
నేడు ఈ జంతు సమాజంలో విరిగి ముక్కలైన పవిత్రత
ఇది కొందరికే వర్తిస్తుంది
సూర్య చంద్రులు ప్రతి రోజు ఉదయిస్తున్నారు అంటే
ఆ కొందరి కోసమే
అందుకే నీవు మనిషివని మానవత్వం కాపాడడం కోసం
రాఖీలాంటి రక్షాబంధన్ వెన్నెల వర్షం హృదయాలలో
ఈ పవిత్ర బంధం కల్మష భూయిష్టం కాకుండా
జరుపుకోండి ఆయిస్సు పెంచి సుఖసంతోషాలతో జీవింపజేసే సంబంధం
అన్నా చెల్లి,అక్కా తమ్ముడు పవిత్ర ఆత్మలు వెలిగించుకునే దీప జ్యోతులు వెన్నెల పూవుల ఆత్మల సంబంధీకులు ,,,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట